
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ పుల్‌గా రాణించడం అంత సులువు కాదు. కొన్ని సందర్భాల్లో ఆరంగ్రేటం అదిరినా, అది కొనసాగించలేక మధ్యలోనే కెరీర్ ముగించేసిని వాళ్లు ఉన్నారు. ఇక సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత సరైన గుర్తింపు, ఆఫర్లు రాకపోవడంతో వెండితెరను వదులుకున్న సెలబ్రిటీల పిల్లలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ ఈ జాబితాలోకి చేరనుందనే వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
ఈ అమ్మడు.. తొలి సినిమాగా ‘జోష్’ లో నాగచైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత జీవా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రంగం’ సినిమాలో నటించింది. ఈ సినిమా రెండు భాషల్లో హిట్ కావడంతో మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లును అందుకుంది. ఫలితంగా ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ లో నటించగా, ఆ అవకాశం తన కెరీర్‌కు ఉపయోగపడలేదనే చెప్పాలి.
గత కొంత కాలంగా కార్తీక ఆఫర్లు లేకపోవడంతో ఇక నటనకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ వార్త కోలీవుడ్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది. సినిమాలకు స్వస్తి పలికి వ్యాపారం వైపు శ్రద్ధ పెట్టాలని కార్తీక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
చదవండి: salaar movie: ఇది నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే!
Comments
Please login to add a commentAdd a comment