బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: మైదుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరే పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. మాజీ మంత్రి డీఎల్‌పై అసంతృప్తితోనే వారు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, వారి నాయకుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలోకి వెళ్లనున్నాడని, అందుకు సంకేతమే కార్యకర్తలు పార్టీ మారడమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల మైదుకూరు మండలం, వనిపెటంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు జాఫర్ హుసేన్ తన అనుచరులు, బంధువర్గంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా అదే మండలం నంద్యాలంపేట పంచాయతీలో 27 ఏళ్లుగా రవీంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటున్న రంతుమియాతోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు.
అలాగే దువ్వూరు మండలంలో కూడా డీఎల్ ముఖ్య అనుచరుడు గురువయ్య, శ్రీరామ్ సాయినగర్‌కు చెందిన మరికొంత మంది కార్యకర్తలు కూడా ఇటీవలే టీడీపీలో చేరారు. బి.మఠం మండలంలో కూడా డీఎల్ ముఖ్య అనుచరులు కొంత మంది టీడీపీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైదుకూరులో డీఎల్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తిరుగుతుండటం, కొద్ది రోజుల క్రితం బి.మఠం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్ నిధులు స్వాహా చేసిన విషయంపై డీఎల్‌ను ఆశ్రయించినట్లుగా వార్తలు రావడం, డీఎల్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరతారనేదానికి బలం చేకూరుస్తున్నాయి.
కాంగ్రెస్ టు టీడీపీ
Published Thu, Dec 12 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement