ఆడియో టేప్ లీక్‌: ఖుష్బూ క్ష‌మాప‌ణ‌ | Khushbu Apologise To Journalists Over Leaked Audio Tape | Sakshi
Sakshi News home page

వాట్సాప్ గ్రూపు నుంచి ఖుష్బూ ఆడియో టేప్ లీక్‌

Jun 10 2020 3:07 PM | Updated on Jun 10 2020 3:27 PM

Khushbu Apologise To Journalists Over Leaked Audio Tape - Sakshi

న‌టి, రాజ‌కీయ నాయకురాలు ఖుష్బూ వివాదంలో ఇరుక్కుంది. టీవీ సీరియ‌ళ్ల షూటింగ్స్‌ తిరిగి ప్రారంభించ‌డంపై నిర్మాత‌ల వాట్సాప్‌ గ్రూపులో ఆమె మాట్లాడిన ఆడియో టేప్ బ‌య‌ట‌కు లీకైంది. ఇందులో "జ‌ర్న‌లిస్టుల‌కు ఇప్పుడు కోవిడ్ త‌ప్ప ఏ వార్త‌లూ లేవు. షూటింగ్స్ త్వ‌ర‌లో తిరిగి ప్రారంభం అవుతున్నందున వారు ఫొటోలు, వీడియోల కోసం వెంట‌ప‌డుతారు. కానీ, అస్స‌లు ఇవ్వ‌కండి. సొంతంగా క‌థ‌లు అల్లుతూ మ‌న‌ల్ని చీల్చి చెండాడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి" అని పేర్కొంది. ఖుష్బూ వ్యాఖ్య‌ల‌పై పాత్రికేయ వ‌ర్గాలు పెద్ద ఎత్తున మండిప‌డ్డాయి. దీంతో ఆమె ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ త‌న వాయిస్‌ను కొంత ఎడిట్ చేశార‌ని తెలిపింది. (నటి కుష్బూ డాక్టరయ్యారు! )

"నిర్మాత‌ల గ్రూప్‌లో నుంచి ఒక‌రు దాన్ని కావాల‌నే లీక్ చేశారు. ఇలాంటి వ్య‌క్తుల మ‌ధ్య ఉన్నందుకు సిగ్గుప‌డుతున్నాను. జ‌ర్న‌లిస్టుల‌ను అగౌర‌వ‌ప‌ర్చ‌డం నా ఉద్దేశ్యం కాదు. కేవ‌లం స్నేహితుల ద‌గ్గ‌ర ఎలా మాట్లాడ‌తామో అలాగే మాట్లాడాను. నాకు ప్రెస్ ప‌ట్ల‌ ఎంత గౌర‌వం ఉంద‌న్న విష‌యం పాత్రికేయులంద‌రికీ తెలుసు. 34 ఏళ్ల సినీ జీవితంలో ఒక్క‌సారి కూడా వాళ్ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌లేదు. ఒకవేళ ఎవ‌రినైనా బాధ‌పెట్టుంటే వారికి నా హృద‌య‌పూర్వ‌క‌ క్ష‌మాపణ‌లు" అంటూ పేర్కొంది. ఇక ఆడియో క్లిప్‌ లీక్ చేసిన నిర్మాత ఎవ‌రో త‌న‌కు తెలుస‌ని ఖుష్బూ వ్యాఖ్యానించింది. త‌న మౌనం, క్ష‌మాగుణ‌మే అత‌నికి పెద్ద శిక్ష అని పేర్కొంది. (వైరస్‌ బారిన వారియర్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement