ఖుష్బూ
గోమూత్రం, పేడ కరోనా వైరస్‌కు మందంటూ చేస్తున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. ( కరోనా ఎఫెక్ట్: గో మూత్రంతో విందు )
Can the blind pls wake up? STOP THIS NONSENSE THAT COW URINE WILL CURE ANY AILMENT. You are putting people lives at risk. PLS DO NOT INVOLVE ANY RELIGIOUS LINKINGS OR ADD ANY SAFFRON COLOR TO HEALTH RELATED ISSUES. LETS NOT MISLEAD THE POOR UNEDUCATED FOR WORSE. https://t.co/RrORhatd3s
— KhushbuSundar ❤️ (@khushsundar) March 15, 2020
Comments
Please login to add a commentAdd a comment