cow urine
-
గోమూత్రానికి వైద్య విలువలు
చెన్నై: వ్యాధులను నయం చేసే శక్తి గోమూత్రానికి ఉందంటూ మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి చెప్పినట్లున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గోమూత్రం సేవించి తీవ్రమైన జ్వరం నుంచి బయటపడినట్లుగా ఓ ముని చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన..‘ఆవు మూత్రానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, జీర్ణశక్తిని కలిగించే లక్షణాలున్నాయి. కొన్ని రకాల జీర్ణ సంబంధ వ్యాధులను ఇది నయం చేయగలదు’అని అన్నారు. ఈ నెల 15న గో సంరక్షణ శాలలో జరిగిన కార్యక్రమంలో కామకోటి దేశీయ ఆవు జాతుల వృద్ధి, ఆర్గానిక్ వ్యవసాయం ప్రాముఖ్యంపై ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం దేశ ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. డీఎంకే సహా కొన్ని ద్రవిడ పారీ్టలు కామకోటి వ్యాఖ్యలను సిగ్గుచేటుగా అభివర్ణించాయి. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ కామకోటి ఐఐటీ చైర్మన్ హోదాకు తగరంటూ వ్యాఖ్యానించారు. అయితే, డైరెక్టర్ కామకోటి ఎంతో విస్తృతార్థంలోనే గోమూత్రాన్ని కొనియాడారని, స్వయంగా ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. -
‘గో మూత్ర’ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. ‘నిన్న నేను చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎవరి మనోభావాలనైనా నేను గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతున్నా’అని సెంథిల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. అంతకముందు ఉదయం సామాజిక మధ్యమం ఎక్స్‌లోనూ పార్లమెంట్లో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ‘నేను నిన్న కొన్ని మాటలను అసంబంద్ధంగా వాడాను. ఇందుకు నేనువిచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించాల్సిందిగా కోరుతున్నా’అని తెలిపారు. కాగా, సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రులు సహా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ఇలాంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కార్తిచిదంబరం, రాజీవ్‌శుక్లా కూడా సెంథిల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంటులో మంగళవారం మాట్లాడుతూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యలు చేసి వివాదం రాజేసిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..భార్య, పిల్లలను చంపి డాక్టర్ సూసైడ్..కారణమిదే! -
కర్ణాటక: విధాన సభను గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎందుకంటే!
బెంగళూరు: కర్ణాటక ప్రజలు అధికార బీజేపీకి షాక్కిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ అవినీతి పాలన అంతమైంది కాబట్టే తాము ఈ కార్యక్రమం చేపట్టామని కార్యకర్తలు తెలిపారు. విధాన సభను శుద్ది చేయాల్సిన అవసరం ఉంది ఇదిలా ఉండగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ గతంలో విధానసౌధ (అసెంబ్లీ)ని గోమూత్రంతో శుభ్రపరచాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపిస్తూ.. శుద్ధి చేసేందుకు తన వద్ద ఆవు మూత్రం కూడా ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, పలు స్కామ్‌ల వివరాలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వీటిని హైలైట్ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, కాంగ్రెస్ అధికార బీజేపీ ప్రభుత్వం చేసిన వివిధ ‘స్కామ్‌లను’ ఎత్తి చూపుతూ ద్విభాషా ‘అవినీతి రేటు కార్డు’ను రూపొందించింది. ‘అవినీతి రేటు కార్డు’ను ఇంగ్లీషు, కన్నడ భాషల్లో విడుదల చేసింది. ‘అవినీతి కార్డులో సీఎం ఖరీదు రూ.2,500 కోట్లు, మంత్రి పదవి ఖరీదు రూ.500 కోట్లకు బేరం పెట్టినట్లు కాంగ్రెస్ విమర్శించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని.. ఇక కాంట్రాక్టులకు 40 శాతం, కొవిడ్-19 సరఫరాలకు 75 శాతం వరకూ బీజేపీ నేతలు కమీషన్లు వసూలు చేశారని విమర్శలు గుప్పించింది. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
Cow Urine: గోమూత్రంతో నీళ్ల ట్యాంక్ శుభ్రం!
బెంగళూరు: దేశంలో కుల, మత, వర్గ వైషమ్యాలకు.. రాజకీయాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితం.. విద్వేషాన్ని ఎక్కించుకుని మూర్ఖంగా వ్యవహరించే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ దళిత మహిళ నీరు తాగిందనే కోపంతో.. నీటి ట్యాంకర్‌ను శుభ్రం చేశారు గ్రామస్తులు. అదీ గోమూత్రంతో కావడం గమనార్హం. ఛామరాజనగర్ జిల్లా హోగ్గోటరా గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 18వ తేదీన గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అయితే.. ఆ వేడుకకు హాజరైన ఓ మహిళ.. తిన్న తర్వాత దాహం తీర్చుకునేందుకు అక్కడే ఉన్న ఓ ట్యాంకర్ నల్లా ద్వారా నీరు తాగింది. ఇది గమనించిన కొందరు పెద్దలు.. సదరు మహిళ ఎస్సీకి చెందింది కావడంతో రచ్చ చేశారు. వేడుకలో తాగేందుకు ఎవరూ అంగీకరించలేదని.. అందుకే దాహం తీర్చుకునేందుకు ట్యాంక్ నీళ్లు తాగానని ఆమె చెప్పింది. అయితే ఆ పెద్దలు ఆమెను మందలించి.. ట్యాంకర్ నుంచి నీటిని ఖాళీ చేయించారు. ఆపై కొందరి సలహాతో ‘పవిత్ర’మైన గోమూత్రంతో ట్యాంకర్‌ను శుభ్రం చేయించారట. ఈ ఘటన స్థానిక తహసీల్దార్ దృష్టికి వెళ్లగా.. ట్యాంకర్ శుభ్రం చేసిన మాట వాస్తవమేనని, అయితే అది గోమూత్రంతో అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదని మీడియాకు తెలిపారు. ఇక బాధితురాలి గురించి తమ దగ్గర సమాచారం లేదన్న ఆయన.. ఆమె గురించి తెలిస్తే విచారించి, కేసు నమోదు చేస్తామని అన్నారు. అంతేకాదు గ్రామంలో చాలా వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని, అందులో నీరు ఎవరైనా తాగొచ్చని ఆయన చెప్తున్నారు. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో.. పూర్తి స్థాయి నివేదికకు సిద్ధమైనట్లు సదరు తహసీల్దార్ వెల్లడించారు. -
‘‘రోజు గోమూత్రం తాగుతాను.. అందుకే కరోనా రాలేదు’’
భోపాల్: ఓ వైపు కరోనా వైరస్‌ని కట్టడి కోసం ప్రభుత్వాలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తుండగా.. మరోవైపు జనాలు మూఢనమ్మకాలతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఆవు పేడ రాసుకుంటే, తాటి కల్లు తాగితే కరోనా తగ్గుతుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతన్న సంగతి తెలిసిందే. సామాన్యులు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారంటే అనుకోవచ్చు.. కానీ ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడటం విచారకరం. తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. తాను ప్రతిరోజు గోమూత్రం తాగుతున్నానని.. అందుకే కరోనా బారిన పడలేదని తెలిపారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. పార్టీ సమావేశంలో ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతిరోజు గోమూత్రం సేవిస్తాను. అందుకే నాకు కరోనా సోకలేదు. దేశీ గో మూత్రం తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది’’ అన్నారు. ‘‘అయితే ప్రతిరోజు ప్రార్థన చేసిన తరువాతనే నేను గోమూత్రాన్ని సేవిస్తాను. ఇది నా ప్రాణాలు కాపాడే అమృతం. నా ప్రాణాన్ని కాపాడు.. నా జీవితం దేశానికే అంకింతం అంటూ ప్రార్థిస్తాను. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ప్రతిరోజు గోమూత్రం సేవించండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి’’ అంటూ సాగిన ఈ ఉపన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపి.. దేశవ్యాప్తంగా గోమూత్రం పంచండి అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత -
కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
-
ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
గాంధీనగర్: ఓ బీజేపీ నాయకుడు దారుణానికి పాల్పడ్డాడు. వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడు. తాగించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి తీరును ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలి వద్దకు బీజేపీ సూరత్ ప్రధాన కార్యదర్శి కిశోర్ బిందల్ వచ్చాడు. పీపీఈ కిట్ ధరించి బీజేపీ కండువా వేసుకుని వచ్చిన అతడు ఓ బాటిల్ తీసుకొచ్చాడు. యాసిడ్ రంగులో ఉన్న ద్రావణం ఆమె నోటిలో పోశాడు. ఆమెకు బలవంతంగా బిందల్ ఆవు మూత్రం తాగించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దాదాపు 80 వేల వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్‌తో పాటు ఘోరంగా తిట్లు.. విమర్శలు రావడంతో దెబ్బకు ఆ వీడియోను బిందల్ తీసేశాడు. అయితే అప్పటికే ఆ వీడియో పలువురు షేర్ చేయడం.. కాపీ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ బీజేపీ నాయకుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో కరోనాకు విరుగుడు ఆవుమూత్రం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది నిరూపించేందుకు కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియడం లేదు. ఏ ఆస్పత్రి? బాధితురాలు ఎవరు? అనేది తెలియడం లేదు. పార్టీ నాయకుడిని ఆస్పత్రిలో కండువా ధరించి ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా ఇప్పుడు వైరలవుతోంది. చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి -
రోజు ఉదయం ఆవు మూత్రం తాగుతా..
ఆవు మూత్రానికి భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి గ్రామాల్లో చిన్న పిల్లలకు ఆవు పంచకంతో ఒక్కసారి అయిన స్నానం చేయిస్తారు. ఇక చాలా మంది దీన్ని సేవిస్తారు. ఈ నేపథ్యంలో హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఆయుర్వేద పరంగా ఇది ఎంతో మంచిదన్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. అక్షయ్ ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బేర్ గ్రిల్స్, హ్యూమా ఖురేషిలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నారు అక్షయ్. దానిలో భాగంగా హ్యుమా ఖురేషి ‘ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్‌ని ఎలా ఒప్పించారని’ బేర్ గ్రిల్స్‌ని అడిగింది. అందుకు ‘ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు’ అన్నారు బేర్ గ్రిల్స్. (చదవండి: రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఇంతలో అక్షయ్ ‘నేను ప్రతి రోజు ఆము మూత్రం తాగుతాను. కాబట్టి ఈ టీ తాగడానికి నేను పెద్దగా భయపడలేదు.. ఆశ్చర్యపడలేదు’ అని తెలిపారు. అక్షయ్ ఆవు మూత్రం తాగుతానని తెలపడం ఇదే ప్రథమం. ఈ సమాధానంతో హ్యుమా ఖురేషీతో పాటు నెటిజనులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదపరంగా ఆవు మూత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేను ప్రతి రోజు సేవిస్తాను. ఏనుగు వ్యర్థాలతో చేసిన టీ కూడా ఆయుర్వేదపరంగా మంచిదే. అందుకే తాగడానికి ఇబ్బంది పడలేదు’ అని తెలిపారు. ఇక ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో రేపు (సెప్టెంబర్ 11) రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్లో.. సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో టెలికాస్ట్ అవుతుంది. View this post on Instagram @beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 10, 2020 at 2:06am PDT -
ఆ చెత్తంతా ఆపండి.. ఖుష్బూ ఫైర్!
గోమూత్రం, పేడ కరోనా వైరస్‌కు మందంటూ చేస్తున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. ( కరోనా ఎఫెక్ట్: గో మూత్రంతో విందు ) Can the blind pls wake up? STOP THIS NONSENSE THAT COW URINE WILL CURE ANY AILMENT. You are putting people lives at risk. PLS DO NOT INVOLVE ANY RELIGIOUS LINKINGS OR ADD ANY SAFFRON COLOR TO HEALTH RELATED ISSUES. LETS NOT MISLEAD THE POOR UNEDUCATED FOR WORSE. https://t.co/RrORhatd3s — KhushbuSundar ❤️ (@khushsundar) March 15, 2020 -
‘గో మూత్రం తాగే మీరు మమ్మల్ని అంటారా’
ఇస్లామాబాద్ : అసలే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో ఓ పాకిస్తాన్ మంత్రి హిందువులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఇమ్రాన్ ఖాన్‌తో సహా పార్టీలోని సీనియర్ మంత్రులంతా సదరు మినిస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ సమాచార మంత్రి ఫయ్యాజుల్ హసన్ చోహాన్ హిందువులను ఉద్దేశిస్తూ.. ఆవు మూత్రం తాగే జనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది. వివరాలు.. ఫయ్యాజుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ముస్లింలకు ప్రత్యేకంగా ఓ జెండా ఉంటుంది. ఇది మౌలా అలియా ధైర్యానికి, హజ్రాత్ ఉమారా శౌర్యానికి ప్రతీక. కానీ మీకంటూ ఎటువంటి ప్రత్యేక జెండా లేదు. మీ చేతుల్లో ఏమి లేదు’ అన్నారు. అంతేకాక ‘గో మూత్రం తాగే మీరు మాకంటే ఏడు రెట్లు ఉన్నతులమనే భ్రమలో ఉన్నారు. కానీ మాకు ఉన్నవి ఏవి కూడా మీకు లేవు. మీరు విగ్రహారాధకులు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఫయ్యాజుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను పాక్ సీనియర్ మంత్రులతో పాటు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఖండించారు. మైనారిటీల పట్ల తప్పుగా వ్యవహరించేవారిని పీటీఐ పార్టీ ఎన్నటికి క్షమించదని.. ఫయ్యాజుల్ మీద తగిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ తెలిపారు. -
ఆవు పేడతో సౌందర్య ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌లో
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇకపై ఆవు మూత్రం, పేడ నుంచి తయారైన ఫేస్ ప్యాక్స్, షాంపూలు తదితర ఔషధ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్సెస్) అనుబంధ ఔషధ ఉత్పత్తి సంస్థ దీన్‌దయాళ్ ధామ్ ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గోమూత్రం, ఆపు పేడతో చేసిన సబ్బులు, ఫేస్‌క్రీములు, షాంపూలు లాంటి ఇతర మెడికల్ ఉత్పతులను అమెజాన్ ఇండియాలో అమ్మేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అమెజాన్‌తో చర్చలు నిర్వహించామని, మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటనలు అమెజాన్ వెబ్సైట్లో చూడవచ్చని కూడా సంస్థ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర లోని ఆర్ఎస్ఎస్ కుచెందిన దీన్ దయాళ్ ధామ్ సెంటర్లో ఆరోగ్యం, బ్యూటీ, ఆపరెల్కు సంబంధించిన డజన్ ఉత్పత్తులనున అమ్మేందుకు సిద్ధం చేసినట్లు తయారీ కేంద్రం మేనేజర్ ఘన్ శ్యామ్ గుప్తా వెల్లడించారు. దీంతో అమెజాన్ వెబ్సైట్లో వినియోగదారులు ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్అయిన వెంటనే వెబ్సైట్ తమకు సమాచారం అందిస్తుంది. అయితే కొరియర్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు, కాబట్టి అ మెజాన్ భారతీయ పోస్టల్ శాఖ ద్వారా 10రోజుట్లో వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశామని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే ఆవుపేడతో పాటు పేడతో చేసిన పిడకలు, గోమూత్రం కూడా ఆన్లైన్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. -
గోమూత్రంతో ఔషధాలు..
సాక్షి, లక్నో : గోమూత్రంతో ఔషధాల తయారీకి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వంటి పలు వ్యాధులకు గోమూత్రంతో ఎనమిది రకాల మందులను రూపొందించాలని తమ శాఖ సంసిద్ధమైందని ఆయుర్వేద విభాగ సంచాలకులు డాక్టర్ ఆర్ఆర్ చౌధరి తెలిపారు. గోమూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యితో ప్రైవేట్ యూనిట్స్‌తో కలిసి ఆయుర్వేదిక్ మందులు తయారుచేస్తామని చెప్పారు. ఆయుర్వేదలో భాగమైన గోమూత్రం పలు వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందన్నారు. పలు పరిశోధనల్లో గోమూత్ర ప్రయోజనాలపై సానుకూల ఫలితాలు వెలుగుచూశాయన్నారు. యూపీలోని ఎనిమిది ఆయుర్వేద కళాశాలలు, బోధనాసుపత్రులకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఆయా ఆస్పత్రులకు రోజూ పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారన్నారు. -
ఆవుపేడపై పరిశోధనకు ఓ కమిటీ!
వ్యాధులను నయం చేయడంలో గోమూత్రం, గోమయం (ఆవుపేడ) పాత్ర ఏమైనా ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవు పవిత్రమైనదని, దాని మూత్రం, పేడలతో అపార ప్రయోజనాలున్నాయని చెబుతున్న వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ విషయంలో వాస్తవాలను శాస్త్రీయంగా రుజువు చేసేందుకు ఈ కమిటీని నియమిస్తామని కేంద్రం తెలిపింది. ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి.. వీటన్నింటితో కూడిన 'పంచగవ్య'కు ఔషధ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఐఐటీ ఢిల్లీలోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (సీఆర్డీటీ) ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. ఐఐటీ ఢిల్లీలో జరిగే జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై వివరంగా చర్చిస్తామని సీఆర్డీటీ అధిపతి ప్రొఫెసర్ వీరేంద్రకుమార్ తెలిపారు. స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ త్వరలోనే తెలియజేస్తుందని ఆవు మూత్రం, పేడలపై దీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్న విజయ్ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కమిటీ విషయాన్ని తెలిపారు. అయితే కమిటీ కోసం ప్రత్యేకంగా నిధులు మాత్రం ఏమీ కేటాయించలేదు. ఆర్ అండ్ డీ స్కీము కిందే దీనికి నిధులిస్తామన్నారు. -
గో మూత్రంతో తిరిగే గడియారం
ఉంగుటూరు : గడియారం తిరగడానికి బ్యాటరీ అవసరం లేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాల నిర్వాహకులు. రెండు లీటర్ల గోమూత్రంతో గడియారం తిరిగేలా చేయవచ్చని నిరూపించారు. గోశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ విధానాన్ని ప్రదర్శించారు. గడియారాన్ని పనిచేయించే విధానం ఇలా.. రెండు ప్లాస్టిక్ డబ్బాల్లో లీటరు చొప్పున గోమూత్రం నింపాలి. రెండు జింక్ ప్లేట్లు, రెండు కాపర్ ప్లేట్లను తీసుకోవాలి. రెండు జింక్ ప్లేట్లకు విద్యుత్ వైరు అమర్చి గో మూత్రం ఉన్న ఒక డబ్బాలో వేయాలి. ఇది మైనస్‌గా పనిచేస్తుంది. గో మూత్రం ఉన్న మరో డబ్బాలో వైరు అమర్చిన రెండు కాపర్ ప్లేట్లు ఉంచాలి. ఇది ప్లస్‌గా పనిచేస్తుంది. ఈ రెండు వైర్లను బ్యాటరీ పరిమాణంలో ఉండే పుల్లముక్కకు రెండు వైపులా అమర్చి, ఆ పుల్లముక్కను గడియారంలో ఉండే బ్యాటరీ స్థానంలో అమర్చితే గడియారం పనిచేస్తుంది. డబ్బాల్లో ఒకసారి పోసిన ఆవు మూత్రంతో గడియారం 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఆ తరువాత ప్రతి 14 రోజులకు ఒకసారి డబ్బాల్లోని గో మూత్రం మారిస్తే సరిపోతుంది. వివరాలకు 99487 96638 నంబర్లో సంప్రదించవచ్చు. -
'ఆస్పత్రుల్లో గోమూత్రాన్ని వాడండి..'
ముంబై: ఆవు పాలే కాదు గోమూత్రం కూడా మానవాళికి ఎంతో మేలు చేస్తుందని ముంబై కొర్పొరేటర్ పర్మీందర్ భమ్రా చెబుతున్నారు. గోమూత్రం క్రిములను చంపుతుందని, దీంతోనే తన ఇంటిని శుభ్రం చేస్తామని చెప్పారు. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను గోమూత్రంతో శుభ్రం చేయాలని సూచించారు. 'గోమూత్రంతో ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేస్తాం. ఇది క్రిములను చంపుతుంది. గోమూత్రం సులభంగా లభిస్తుంది. మా ఇంటి సమీపంలోని గోశాల నుంచి తీసుకువస్తా. ఆస్పత్రులు కూడా శుభ్రత కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు' అని భమ్రా అన్నారు. మలాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా ఎన్నికైన భమ్రా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో శుభ్రం చేయడానికి గోమూత్రం వాడాలని కోరుతూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిపాదన చేశారు. అయితే వైద్య నిపుణులు భిన్నంగా స్పందించారు. శాస్త్రీయంగా చూస్తే శుభ్రం చేయడానికి గోమూత్రం ఎప్పటికీ ఆమోదం పొందదని నాగపూర్ వెటర్నరీ కాలేజీ మాజీ డైరక్టర్, బాంబే వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ వీఎల్ దేవ్పుర్కార్ అభిప్రాయపడ్డారు. గోమూత్రాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తారని, శుభత్ర కోసం వాడరని చెప్పారు. గో విజ్ఞాన్ అనుసాంధాన్ కేంద్ర నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆస్పత్రుల శుభ్రానికి గోమూత్రం
వృధాగా పోయే గోమూత్రంతో ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వాస్పత్రులు ముందుకొస్తున్నాయి. ఖరీదైన ఫినాయిల్‌ను పక్కన పడేసి గో మూత్రంతోనే ఆస్పత్రిలను శుభ్రం చేయిస్తామని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రి ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ ప్రకటించారు. జలోర్ జిల్లాలోని పథ్మేడ గ్రామంలో ఏర్పాటు చేసిన గోమూత్రం రిపైనరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రిఫైనరీని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఫినాయిల్ స్థానంలో గో మూత్రానికి వేపాకును కలిపి ఉపయోగించడం మంచిదని, దానివల్ల ఆవు పట్ల మనకున్న ఆరాధ్య భావన మరింత ఇనుమడిస్తుందని కేంద్రమంత్రి, జంతు కారుణ్య కార్యకర్త మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి శుచి, శుభ్రతల కోసం గో మూత్రాన్ని ఉపయోగించాలనే ఆలోచన ఆమెదే. గత మార్చి నెలలోనే ఆమె ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. పథ్మేడ గ్రామంలో రూ. 4 కోట్లతో గోమూత్రం రిఫైనరీ ప్లాంటును గోపాల్ గోవర్ధన్ గోశాల అనే సంస్థ ఏర్పాటుచేసింది. ఆవు పాలు, మూత్రాన్ని ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తులను ఇక తాము విరివిగా మార్కెటింగ్ చేస్తామని రిఫైనరీ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైద్య శ్యామ్సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. రోజుకు 7 వేల లీటర్ల గోమూత్రాన్ని శుద్ధిచేసే సామర్థ్యం తమ రిఫైనరీకి ఉందని, వాటిలో సగభాగాన్ని శుభ్రత ఉత్పత్తుల కోసం, మిగతా సగ భాగాన్ని ఔషధాల కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. మధుమేహం, హృద్రోగుల ఔషధాల్లో గో మూత్రాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు. -
ఫినాయిల్ కాదు.. గోనాయిల్ మేలు
న్యూఢిల్లీ: ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు ఫినాయిల్కు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన గోనైల్ వాడాలని కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖామంత్రి మేనక గాంధీ సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రస్తుతం వాడుతున్న ఫినాయిల్ వల్ల వాతావరణానికి హాని కలుగుతుందని..దీనికి ఆవు మూత్రం మంచి ప్రత్యామ్నాయమని ఆమె అన్నారు. కెమికల్స్‌తో కూడిన ఫినాయిల్కు బదులుగా ఆవు మూత్రం నుండి తయారుచేసిన సహజ క్రిమిసంహారిణి(గోనాయిల్)ను వాడాలని ఆమె తన శాఖ ఉద్యోగులను కోరారు. ఈ గోనాయిల్ రోగక్రిమినాశినే కాకుండా వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని మేనకాగాంధీ తెలిపారు. హోలీ కౌ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గౌనాయిల్ విరివిగా తయారు చేస్తోందనీ, సింథటిక్ బేస్ తో ఉన్న ఫినాయిల్ కంటే గోనాయిల్ చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని మంత్రి చెబుతున్నారు. ఆయుర్వేద వైద్య విధానాలు, హిందూ సాంప్రదాయాల్లో ఆవుకున్న ప్రాధాన్యతను గురించి నొక్కి వక్కాణించిన వారిలో మేనకాగాంధీ ఒక్కరే కాదు మరో కేంద్రమంత్రి కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా నూతన ఆరోగ్య పాలసీ అమల్లోకి రానున్నట్టు ..ఆయుష్ వైద్య విధానాలకు అధిక ప్రాథాన్యత ఇవ్వనున్నట్లు ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పాదనాయక్ గతంలోనే ప్రకటించారు. ఆయుర్వేదిక్ కంపెనీలు తయారుచేస్తున్న మందులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఆవు నుండి లభించే పాలు, పెరుగు నెయ్యి,మూత్రం, పేడ లాంటి అయిదు పదార్థాలతో తయారుచేసి పంచగవ్యలో ఎన్నో ఔషధ విలువలున్నాయన్నారు.