మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ కామకోటి
వైరల్‌గా మారిన వీడియో
చెన్నై: వ్యాధులను నయం చేసే శక్తి గోమూత్రానికి ఉందంటూ మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి చెప్పినట్లున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గోమూత్రం సేవించి తీవ్రమైన జ్వరం నుంచి బయటపడినట్లుగా ఓ ముని చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన..‘ఆవు మూత్రానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, జీర్ణశక్తిని కలిగించే లక్షణాలున్నాయి. కొన్ని రకాల జీర్ణ సంబంధ వ్యాధులను ఇది నయం చేయగలదు’అని అన్నారు.
ఈ నెల 15న గో సంరక్షణ శాలలో జరిగిన కార్యక్రమంలో కామకోటి దేశీయ ఆవు జాతుల వృద్ధి, ఆర్గానిక్ వ్యవసాయం ప్రాముఖ్యంపై ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం దేశ ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. డీఎంకే సహా కొన్ని ద్రవిడ పారీ్టలు కామకోటి వ్యాఖ్యలను సిగ్గుచేటుగా అభివర్ణించాయి. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ కామకోటి ఐఐటీ చైర్మన్ హోదాకు తగరంటూ వ్యాఖ్యానించారు. అయితే, డైరెక్టర్ కామకోటి ఎంతో విస్తృతార్థంలోనే గోమూత్రాన్ని కొనియాడారని, స్వయంగా ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment