న్యూఢిల్లీ: అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు.
స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్‌ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు.
Comments
Please login to add a commentAdd a comment