న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు.
‘నిన్న నేను చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎవరి మనోభావాలనైనా నేను గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతున్నా’అని సెంథిల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
అంతకముందు ఉదయం సామాజిక మధ్యమం ఎక్స్‌లోనూ పార్లమెంట్‌లో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ‘నేను నిన్న కొన్ని మాటలను అసంబంద్ధంగా వాడాను. ఇందుకు నేనువిచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించాల్సిందిగా కోరుతున్నా’అని తెలిపారు.
కాగా, సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు సహా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ఇలాంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు కార్తిచిదంబరం, రాజీవ్‌శుక్లా కూడా సెంథిల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంటులో మంగళవారం మాట్లాడుతూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యలు చేసి వివాదం రాజేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment