ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, లక్నో : గోమూత్రంతో ఔషధాల తయారీకి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వంటి పలు వ్యాధులకు గోమూత్రంతో ఎనమిది రకాల మందులను రూపొందించాలని తమ శాఖ సంసిద్ధమైందని ఆయుర్వేద విభాగ సంచాలకులు డాక్టర్ ఆర్‌ఆర్ చౌధరి తెలిపారు. గోమూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యితో ప్రైవేట్ యూనిట్స్‌తో కలిసి ఆయుర్వేదిక్ మందులు తయారుచేస్తామని చెప్పారు.
ఆయుర్వేదలో భాగమైన గోమూత్రం పలు వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందన్నారు. పలు పరిశోధనల్లో గోమూత్ర ప్రయోజనాలపై సానుకూల ఫలితాలు వెలుగుచూశాయన్నారు. యూపీలోని ఎనిమిది ఆయుర్వేద కళాశాలలు, బోధనాసుపత్రులకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఆయా ఆస్పత్రులకు రోజూ పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment