
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇకపై ఆవు మూత్రం, పేడ నుంచి తయారైన ఫేస్ ప్యాక్స్, షాంపూలు తదితర ఔషధ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్సెస్) అనుబంధ ఔషధ ఉత్పత్తి సంస్థ దీన్‌దయాళ్ ధామ్ ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గోమూత్రం, ఆపు పేడతో చేసిన సబ్బులు, ఫేస్‌క్రీములు, షాంపూలు లాంటి ఇతర మెడికల్ ఉత్పతులను అమెజాన్ ఇండియాలో అమ్మేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అమెజాన్‌తో చర్చలు నిర్వహించామని, మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటనలు అమెజాన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని కూడా సంస్థ తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర లోని ఆర్‌ఎస్‌ఎస్ కుచెందిన దీన్ దయాళ్ ధామ్ సెంటర్‌లో ఆరోగ్యం, బ్యూటీ, ఆపరెల్‌కు సంబంధించిన డజన్ ఉత్పత్తులనున అమ్మేందుకు సిద్ధం చేసినట్లు తయారీ కేంద్రం మేనేజర్ ఘన్ శ్యామ్ గుప్తా వెల్లడించారు. దీంతో అమెజాన్ వెబ్‌సైట్‌లో వినియోగదారులు ఆ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్‌అయిన వెంటనే వెబ్‌సైట్ తమకు సమాచారం అందిస్తుంది. అయితే కొరియర్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు, కాబట్టి అ మెజాన్ భారతీయ పోస్టల్ శాఖ ద్వారా 10రోజుట్లో వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశామని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే ఆవుపేడతో పాటు పేడతో చేసిన పిడకలు, గోమూత్రం కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment