
టీ.నగర్: నటి కుష్బూ పట్ల అభిమానం పెంచుకున్న ప్రజలు ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించిన విషయం తెలిసిందే. ఆమె పేరుతో విక్రయానికి వచ్చిన ఇడ్లీలు ప్రాచుర్యం పొందాయి. ఇంతటి కీర్తి సాధించిన కుష్బూ తన ఇంట్లో సామాన్య మహిళలా వంటలు చేస్తారా అనే సందేహం ఉంటుంది. దీన్ని నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా ఆమె టీ చేసి చూపించారామె. చెన్నై గులాం అబ్బాస్ ఆలీఖాన్ వీధుల్లో ముస్లిం మహిళల మధ్య ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో మహిళలు ఆమెకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆటోడ్రైవర్ అయిన ముస్తాఫా ఇంట్లో ఉన్న మహిళలు కుష్బూను చూడగానే అక్కా, మా ఇంట్లో ఏమైనా తాగుతారా? అని ప్రశ్నించారు. అందుకు కుష్బూ ‘‘ఏం ఎందుకు తాగను.. ఇవ్వండి’’ అని బదులిచ్చారు.
అంతేకాకుండా తానే టీ తయారు చేసి ఇస్తాను రండంటూ వంటగదికి దారితీసింది. అది చిన్న వంటగది కావడంతో మహిళ కాస్త ఇబ్బందిపడింది. అయినా కుష్బూ ఏమాత్రం సంకోచించకుండా వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేసింది. వేడివేడిగా టీ తయారు చేసి ఆమె వెంట వెళ్లిన పార్టీ కార్యకర్తలు, విలేకరులు పది మందికి అందించింది. అంతేకాకుండా అక్కడున్న మహిళలు అక్కా టీ సూపర్ అంటూ ప్రశంసించారు. ఇంట్లో ప్రతిరోజు మామ (భర్త)కు తానే టీ తయారుచేసి ఇస్తానని, ఆయనకు ఎంతో నచ్చుతుందని కుష్బూ తెలిపారు.
చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి
Comments
Please login to add a commentAdd a comment