చెన్నై : పోలసుల కస్టడీలో తండ్రీ కుమారుడు ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ర్టవ్యాప్తంగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ డిమాండ్ చేశారు. ఆలస్యం జరగకుండా దోషులకు త్వరగా శిక్షపడేలా అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక కుటుంబం వారి అత్యంత ఆప్తులను కోల్పోయారు. జస్టిస్ ఫర్ జయరాజ్, ఫినిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనను అమానవీయ చర్యగా పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కారని నటుడు జయం రవి పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సింగర్ సుచిత్ర సహా పలువురు ప్రముఖులు సత్వరమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫినిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. (‘సెల్’ కోసమే దాష్టీకమా? )
Will we and can we see law taking its course and punishing the guilty without any further delay in #Jeyaraj and #Fenix case? The culprits cannot and should not get away. A family has lost their most loved ones. Justice delayed is justice denied. #JusticeForJeyarajAndFenix
— KhushbuSundar ❤️ (@khushsundar) June 26, 2020
తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జయరాజ్(63), కుమారుడు ఫినిక్స్(31) జ్యుడీషియల్ కస్టడిలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాము ఆడిన సెల్‌ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు గురువారం మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలకు డీజీపీ త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. (డెత్ వార్ ) ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ లేదా, డీఐజీ కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, సాత్తాన్ కులం లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్‌కు వర్తక లోకం పిలుపునిచ్చింది. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు.
Please share & tag fwd so non-tamil-speaking people can understand what happened #JusticeforJayarajAndFenix @bhakisundar @ahmedmeeranoffl pic.twitter.com/nZ7klPzpsO
— suchi_mirchi (@suchislife2019) June 25, 2020
Comments
Please login to add a commentAdd a comment