ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య | Chiranjeevi, Khushbu, ramya, bhavana to campaign for congress in karnataka BBMP | Sakshi
Sakshi News home page

ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య

Published Wed, Aug 12 2015 12:19 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య - Sakshi

ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య

బెంగళూరు :  త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ఎన్నికలకు  కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సన్నద్ధం అవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.

మరోవైపు వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement