compaigning
-
వాయిస్ కాల్స్‌తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్‌తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్‌ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్‌పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్‌మెయిల్స్, ఫోన్‌కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా..
సాక్షి, కరీంనగర్/మంచిర్యాల: ఓటు హక్కు వినియోగంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డుకు చెందిన అందె సంతోశ్‌బాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ‘‘నా ఓటును అమ్ముకుంటాను.. నాకు సిగ్గులేదు, ఉద్యోగాలు, ఉపాధి అవసరం లేదు, మద్యానికి బిర్యాని, డబ్బులకు అమ్ముడుపోతాను, నాకు సిగ్గులేదు’’ అని ఓ బోర్డును తయారు చేసి తన ద్విచక్ర వాహనం వెనుకాల అమర్చాడు. వాహనంపైనే పట్టణంలో పర్యటిస్తున్నాడు. ప్రజలు పాజిటివ్‌గా చెబితే అర్థం చేసుకోవడం లేదని, ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నట్లు సంతోశ్‌బాబు చెప్పాడు. జాతీయ దారిద్య్ర రేఖ దిగువ ప్రజల హక్కుల పోరాట సమితిని ఇటీవల స్థాపించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఇవి చదవండి: మావోయిస్ట్ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్..! -
కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సీపీ అభిషేక్ మహంతి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో 16 కేసులు నమోదవడం, అందులో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడినా, మందు, విందులు ఏర్పాటు చేసినా, సమయం దాటి ప్రచా రం కొనసాగించినా, డీజే వాహనాలు వాడినా, ఆఖ రుకు ఎమ్మెల్యే అభ్యర్థి పోస్టర్లు వాహనాలకు వేసుకున్నా కేసులు పెడుతూ.. ఆ వాహనాలు సీజ్ చేస్తున్నారు. కొన్ని పార్టీల వారు ప్రచారంలో భాగంగా ఆటోలు, కార్లపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఆ వాహనాలను సీజ్ చేయడంతో తాము జీవనోపాధి కో ల్పోతున్నామని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. ► కేశవపట్నం మండలంలోని ఎరడపల్లికి చెందిన మాతంగి హరికృష్ణ, కలకుంట్ల రంజిత్‌రావు, పోతునూరి హరీశ్, వి.సాయికృష్ణ గత మంగళవారం డీజేతో మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయికి ప్రచారం చేసినందుకు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► చొప్పదండిలో బీఆర్ఎస్కు చెందిన మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, మహేశ్, ఎన్నం మనోహర్, శ్రీకాంత్ అనుమతి లేకుండా స్థానిక ఫంక్షన్హాల్లో దాదాపు 100 మందికి భోజనం, మద్యం సరఫరా చేయగా.. కేసు నమోదైంది. ► కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో ఎం.హరీశ్ కారులో అనుమతి లేకుండా తరలిస్తున్న బీజేపీకి సంబంధించిన 500 కరపత్రాలు, 10 పార్టీ కండువాలు గుర్తించి, కేసు నమోదు చేశారు. ► హుజూరాబాద్‌లో మంగళవారం టీడీపీకి చెంది న ఐత హరీశ్, రామగిరి అంకూస్, ఆడెపు రవీందర్, లింగారావు, ఫయాజ్ అనుమతి లేకుండా అంబేడ్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చినందుకు కేసు నమోదైంది. ► కమాన్ చౌరస్తా వద్ద తనిఖీల్లో శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన నందికొండ మహేందర్‌రెడ్డి కారుపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్‌ను ప్రదర్శించినందుకు కేసు నమోదైంది. ► తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన వరికోళ్లు చంద్రయ్య తన ఆటోపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్ ప్రదర్శించినందుకు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► గంగాధరకు చెందిన పులి మారుతి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం బుధవారం అనుమతి లేకుండా వంద మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రామడుగులోని ముదిరాజ్ సంఘం భవనం వరకు డీజే వినియోగంపై కేసు నమోదైంది. ► గంగాధరకు చెందిన లోక రాజేశ్వర్, రామిడి సురేందర్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ తాడిచెరువు గ్రామ శాఖ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. బుధవారం బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్ సమయం దాటినా ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. ► మానకొండూరులో నిర్వహించిన తనిఖీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మండపల్లికి చెందిన జగ్గాని శివ, చొప్పదండి శ్రీనివాస్ కారులో సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌కి సంబంధించిన 180 కరపత్రాలు, 50 బుక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► జమ్మికుంట పరిధి జగ్గయ్యపల్లెలో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనంలో డీజే వినియోగంపై అబ్దుల్ కరీమ్, బడే జేమ్స్, వడ్డేపల్లి సతీశ్, వడ్డెపల్లి పోచయ్యలపై కేసు నమోదైంది. ► కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద చేపట్టిన తనిఖీ ల్లో తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్కి చెందిన జమీల్‌ఖాన్ తన ఆటోపై బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి పోస్టర్‌ను అంటించినందుకు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ► కశ్మీర్గడ్డలో బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ మహబూబ్ ఖాన్ మైనారిటీ యూత్ ఆత్మీ య సమావేశంలో 500మందికి చికెన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదైంది. ► చొప్పదండిలో గురువారం బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ లోక రాజేశ్వర్ రెడ్డి,బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 300 మందితో సమావేశం నిర్వహించారు. ఇక్కడ డ్రోన్ వినియోగంపై రాజేశ్వర్ రెడ్డి, రవిశంకర్, రాజులపై కేసు నమోదు చేశారు. ► ఇంటింటి ప్రచారానికి బదులుగా గర్శకుర్తిలో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పులి మారుతి, చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం, గ్రామ శాఖ అధ్యక్షుడు చిప్ప చక్రపాణిలపై కేసు నమోదైంది. ► కనపర్తి సర్పంచ్ పర్లపల్లి రమేశ్, వల్బపూర్ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మొలుగు పూర్ణచందర్ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ స్తంభాలకు జెండాలు కట్టడం, టపాసులు పేల్చడంపై గురువారం కేసు నమోదు చేశారు. ► హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్, పార్టీ వీణవంక మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి వీణవంకలోని ఓ ఫంక్షన్హాల్లో 300 మందితో సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. -
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఈసీ కీలక నిర్ణయం.. పార్టీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇండోర్ లేక బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అందుకు జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తీసుకోవాలని, కోవిడ్ మార్గదర్శకాలు పాటించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండోర్ మైదానాల్లో 50 శాతం, బహిరంగ మైదానాల్లో 30 శాతం సీటింగ్ మేరకు ప్రజలకు అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అటు.. ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది. కాగా, ఏడు దశల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల (ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న మొదలు కానున్నాయి. ఈ దశలో యూపీలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. (చదవండి: సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో కాకపెంచిన కేటీఆర్ ట్వీట్) -
‘ప్రాదేశిక’ ఘర్షణ
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని అడెపెల్లి గ్రామంలో శనివారం టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఇరువర్గాల్లో పలువురికి గాయాలయ్యాయి. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రచార చిత్రాలను గోడలపై అంటించే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు కబీర్, షారూక్‌కు తలపై గాయాలయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వీరిని చికిత్స కోసం సిర్పూర్ ఆసుపత్రికి, కాగజ్‌నగర్‌కు తరలించారు. ఘర్షణ సమయంలో కాంగ్రెస్ నాయకులు దూషించారంటూ టీఆర్ఎస్ నాయకులు నాయిని సంతోష్, గడ్డం సత్తయ్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏఎస్సై జహీరుద్దీన్ మాట్లాడుతూ ఇరువర్గాల ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలిపారు. -
బాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైంది...
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు తీగ లాగితే డొంకంతా కదులుతోందని, ఏపీ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా పంజాబ్ పౌరుల సమాచారం కూడా దొంగలించారని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందని అన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్లలో బిల్లుల చెల్లింపులు చేస్తున్న అధికారులు సీఎస్ పునేఠాలాగే ఇబ్బంది పడతారని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, ఆపద్ధర్మ సిఎం చేసిన బదిలీలను రద్దు చేయాలని ఆయన కోరారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రైవేట్ యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ అడ్డుకున్నప్పుడే చంద్రబాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైందన్నారు. ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్వోల మీద భారం వేశారని, అయితే ప్రజా తీర్పు మరోలా ఉండటంతో ఇప్పుడు ఈవీఎంలను బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు.’ అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్లాడట. చంద్రబాబులాగా. ఇక్కడ ఈగల మోతను తప్పించుకోవడానికి రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. చిత్రమేమిటంటే ఆయన స్నేహితులెవరూ స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తరు. ఈయన గాబరా పడ్డట్టు ఈవీఎంల పైనా మాట్లాడరు.’ అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. -
‘తెలంగాణ ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదు’
గచ్చిబౌలి: తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని, ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్ సృష్టికర్త తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గురువారం ఆయన రోడ్‌షో నిర్వహిస్తూ మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్లో ప్రసంగించారు. సైబరాబాద్ తన మానస పుత్రిక అని, 1995 నుంచి హైటెక్ సిటీలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 100 ఎకరాల్లో ఉన్న ఒక్క మైండ్ స్పేస్‌లోనే లక్ష ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. సైబరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని, హెచ్ఐసీసీ, గచ్చిబౌలి స్టేడియం, డైమండ్ నెక్లెస్ లాంటి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చానని చెప్పారు. అమెరికాలో 16 రోజుల పాటు కాలినడకన తిరిగి ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చానన్నారు. టీడీపీ, కాంగ్రెస్ జెండాలు కలిసి పని చేయడం ఓ చరిత్ర అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని నరేంద్ర మోదీని గట్టిగా అడిగానని, ఆయనతో పేద వారికి ఎంతో నష్టం జరిగిందన్నారు. నాలున్నరేళ్లలో ప్రజలకు అసంతృప్తి, బాధలు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. కేంద్రం తీరుతో రూపాయి విలువ పతనమైందన్నారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చారా.. అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. చార్మినార్ కట్టానని చెప్పను.. కేసీఆర్ అన్నట్లుగా తాను చార్మినార్ కట్టానని చెప్పనని, సైబరాబాద్‌ను కట్టానని చెబుతానని చంద్రబాబు అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తూ దేశం కోసం కాంగ్రెస్‌తో కలిశానన్నారు. సీబీఐ భ్రష్టు పట్టిందని, ఈడీ దెబ్బతిందని, ప్రశించిన రాజకీయ నాయకులు, మీడియా, కంపెనీలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్, ఆర్బీఐ వ్యవçస్థలను నిర్వీర్యం చేశారన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతితో ఎక్కడికి వెళుతున్నామో ఆలోచించాలన్నారు. ‘అభివృద్ధి చేసినందుకే కేసీఆర్ తిడుతున్నాడా? తెలంగాణలో నీకేం పని అంటారు. నేను రాకూడదా? మీకు బాధగా లేదా? నగరంలో రోడ్లు బాగు పడలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదు. ఇంటింటికి నీళ్లు రావడం లేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి పంచలేదు. ఎస్సీని సీఎం చేయలేదు’ అని బాబు ధ్వజమెత్తారు. కొట్టినట్లు బీజేపీ, ఏడ్చినట్లు టీఆర్ఎస్ నటిస్తూ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి మంజూరు చేసింది తానేనని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ఒక కూటమిగా, దాని వ్యతిరేక పార్టీలన్నీ మరో కూటమి అని.. ఇందులో నీవు ఏ కూటమో స్పష్టం చేయాలని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణకు న్యాయం చేయాలనుకున్న పార్టీ తమదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ గెలుపు కోసం ప్రజా కూటమి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ప్రజా కూటమిలోని పార్టీల నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి జోష్..
సాక్షి, హైదరాబాద్: కాస్త ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం కేడర్‌లో జోష్ నింపుతోందని కాంగ్రెస్ వర్గాలు సంబరపడుతున్నాయి. పదునైన మాటలు, ప్రభుత్వ పెద్దలపై విమర్శలతో మొదటి నుంచీ వార్తల్లో ఉన్న వ్యక్తిగా, అధికార టీఆర్ఎస్కు మింగుపడని నేతగా గుర్తింపు పొందిన రేవంత్ ప్రచారానికి ఆశించిన స్పందన లభిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్న అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాల్లో నూ రేవంత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి నిత్యం ఒక బహిరంగ సభ, రోడ్ షోలో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో: కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెండ్రోజుల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇతర సీనియర్ నేతలైన మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, షబ్బీర్‌అలీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బహిరంగ సభలతోపాటు రోడ్‌షో కూడా పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ రోడ్‌షో నిర్వహించి కార్యకర్తల్లో ఊపు తెచ్చారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఏఐసీసీ అనుమతి తీసుకున్న రేవంత్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిత్యం 2, 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నా రు. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆసిఫాబా ద్, ఖానాపూర్, బోథ్, కరీంనగర్‌లోని చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, వరంగల్ జిల్లా ములుగులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త అభ్యర్థులకు కీలకం.. మొదటిసారి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో రేవంత్ ప్రచారం ధైర్యాన్ని నింపుతోందని తెలుస్తోంది. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితం కావడంతో కొత్త అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రేవంత్ ప్రచారం ఆయా నియోజకవర్గాల్లోని కేడర్‌కు ఉత్సాహం నింపుతోంది. మేనిఫెస్టోలో ఉత్తమ్ బిజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పార్టీ మేనిఫెస్టో, అసంతృప్తుల బుజ్జగింపు కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో అంతర్గత సమస్యలతో పార్టీ దెబ్బతినకుండా సమన్వయం చేస్తూనే ప్రచారంలోనూ వేగాన్ని పెంచాలని ఉత్తమ్ రేవంత్‌కు సూచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లాల్లోనూ 4 బహిరంగ సభలు నిర్వహించేందుకు రేవంత్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్లోనూ మరో 2 బహిరంగ సభలు, మహబూబ్‌నగర్‌లో 3, ఖమ్మంలో 3, నిజామాబాద్ 2 బహిరంగ సభ లు ఈ వారంలో నిర్వహించనున్నట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సభ నిర్వహిస్తు న్నారు. బుధవారం కోస్గి మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ హాజరుకానున్నారు. ఈ సభలో రేవంత్ గురించి రాహుల్ ఏం చెబుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
ప్రచారం చేయొద్దు...
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం వహించే ఆర్పీల ఎన్నికల ప్రచారంపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ జీవో జారీ చేశారు. దీంతో ఆర్పీలను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలా..వద్దా... అనే వివాదానికి తెరపడింది. సాక్షి, పెద్దపల్లి: ఆర్పీలను ఎన్నికల ప్రచారంలో వాడుకొనే వ్యవహారంలో రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న వివాదం, ఈ స్పష్టతకు దారితీసింది. ఈ నెల 2న రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేనతో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఆర్పీల విషయంపై వాదనకు దిగారు. నిబంధనల పేరిట తన ప్రచారానికి అధికారులు అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ప్రచారానికి ఆర్పీలను వాడుకోవడంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఆర్పీల విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి వచ్చిన వివరణ మేరకే స్పందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మెప్మా విభాగంలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్స్ ఏ రాజకీయ పార్టీకి కాని, అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రకటించారు. ఈ నెల 3న ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్ నివేదిక పంపించారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్‌కుమార్ ఈనెల 9న వివరణ ఇచ్చారు. రీసోర్స్ పర్సన్స్ ఎవరికి అనుకూలంగా కూడా ప్రచా రం చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఊపిరి పీల్చుకున్న ఆర్పీలు గంపగుత్త ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రభావితం చేయడం అభ్యర్థులకు ఎన్నికల్లో కొత్త కాదు. ఎన్నికల ప్రచారంలో, ఓట్లల్లో మహిళా సంఘాలు కీలకం కావడంతో నేతలంతా గ్రూప్‌లపైనే దృష్టి పెడుతారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్పీలపై కొంతమంది అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమ ద్వారానే ఉద్యోగాలు పొందారని, తమకు ప్రచారం చేయకపోతే మీ సంగతి తేల్చుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఆర్పీల ఎన్నికల ప్రచారంపైనా స్పష్టత ఇచ్చింది. -
రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘బంగ్లాదేశ్ వలసదారులు చెద పురుగులు. వందకోట్ల మంది చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించారు. వారంతా చెదపురుగుల్లా దేశాన్ని తింటున్నారు. ఢిల్లీలో అక్రమ వలసదారుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదా? వారిని బయటకు విసిరి పడేయాలా, వద్దా?’ అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్‌లో జరిగిన పలు పార్టీ ర్యాలీల్లో ఆవేశంగా మాట్లాడారు. భారత దేశంలో నేటి జనాభా దాదాపు 127 కోట్లు. వారిలో వంద కోట్ల మంది వలసదారులే అయితే మిగతా 27 కోట్ల మంది మాత్రమే అసలైన భారతీయులా? రోహింగ్యాల సమస్యకు అదే కారణం... ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ జాతిని ఇతర జాతీయులపైకి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టిన పర్యవసానంగానే నేడు రోహింగ్యా ముస్లింల సంక్షోభ సమస్య అటు మయన్మార్‌ను, ఇటు భారత్, బంగ్లాదేశ్‌లను వేధిస్తోంది. బౌద్ధ జాతీయవాద ఉద్యమానికి చెందిన బౌద్ధ మత గురువు ఆషిన్ విరత్తు, రోహింగ్య ముస్లింలను చీడ పురుగులు, పిచ్చి కుక్కలని పదే పదే పిలవడం వల్ల, మనం బలహీనులమైతే రేపు మనదేశమంతా ముస్లింలే ఉంటారంటూ మయన్మార్ హిందువులను రెచ్చ గొట్టిన ఫలితంగా ఆ దేశంలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇరువర్గాలకు చెందిన వారు వేల సంఖ్యలో మరణించారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది రోహింగ్య ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి, దాదాపు లక్ష మంది భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. ఇటీవల కొంత మంది దేశాధినేతలు ఇలాంటి అమానుష, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే గ్రీస్, ఇజ్రాయెల్, అమెరికా, హంగరి, ఉక్రెయిన్, నైజీరియా దేశాల్లో అల్లర్లు చెలరేగి వేలాది మంది మరణించారు. ఓ జాతి మరో జాతి పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించకుండా అమానవీయంగా వ్యవహరించడంతో దార్వన్, కాంబోడియాల్లో జాతుల సంఘర్షణలు భగ్గుమన్నాయి. బాల్కన్ యుద్ధాలు అందుకే జరిగాయి. అలాగే రువాండలోని తుత్సీలను దూహించడం వల్ల వాళ్లకు, హుతూస్కు మధ్య జాతి సంఘర్షణలు చెలరేగుతున్నాయి. 1994లో తుత్సీలను బొద్దింకలంటూ రువాండ రేడియో విమర్శించడం జాతి వైషమ్యాలకు బీజం వేసిందని ‘డేంజరస్ స్పీచ్ ప్రాజెక్ట్’ను ఏర్పాటు చేసిన సుసాన్ బెనేష్ తెలిపారు. 15 లక్షల మంది మృతి.. ఆర్మేనియా మారణకాండ అందుకే జరిగింది. ‘అర్మేనియన్లు టర్కీలోని ముస్లిం సొసైటీకి సోకిన ఇన్ఫెక్షన్. ఆశ్రయమిచ్చిన దేశ ప్రజల ఎముకల మూలుగులను తొలుచుకుతింటున్న పరాన్నభుక్కులు’ అని ఓ వర్గం వారు రెచ్చగొట్టడంతో ఇరువర్గాల మధ్య ఈ మారణ హోమం చెలరేగింది. 2015, ఏప్రిల్ నెలలో ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగిన ఈ మారణ హోమంలో 15 లక్షల మంది ప్రజలు మరణించారు. మారణ హోమం సందర్భంగా దొంగతనాలు, దోపిడీలే కాకుండా విచ్ఛల విడిగా మహిళలపై అత్యాచారాలు కొనసాగాయి. ఎన్నికలు ముగిసే వరకు అమిత్‌షా తీరు అదేనా..? ఇలాంటి మారణహోమాలు ఒక్కసారి చేసే ప్రసంగాల వల్ల తలెత్తుతాయన్నద కాదు. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల జరుగుతాయి. అమిత్ షా తీరు చూస్తుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే మాట్లాడేటట్లు కనిపిస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక్క రోజు ముందు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మాట్లాడుతూ ‘లెవలింగ్ ది గ్రౌండ్’ అంటూ ఆవేశంగా ఇచ్చిన ప్రసంగం ఒక వర్గాన్ని ఎంతో రెచ్చగొట్టింది. -
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా
సాక్షి,బెంగళూరు: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రము ఖ నటి హరిప్రియ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ధర్మగిరి మంజునాథస్వామి దేవాలయంలో ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే నిర్ణయించుకున్నామని ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి తరపున ప్రచారం చేయాల్లో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బహుభాష నటుడు ఉపేంద్ర స్థాపించిన ప్రజా పక్ష పార్టీ తరపున కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని, దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహిస్తామని, తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన సొంత పట్టణం చిక్కబళ్లాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. -
ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య
బెంగళూరు : త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ఎన్నికలకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సన్నద్ధం అవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. -
బావా, బావమరిది ప్రచారాల్లో అపశ్రుతి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారంలో సోమవారం అపశ్రుతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు ప్రచార రథం అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అనంతపురం జిల్లా హిందుపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ కాన్వాయ్ తగిలి ఒకరు గాయపడ్డారు. అయితే ఆ విషయాన్ని బాలయ్య ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. -
జయసుధ మళ్లీ మెప్పిస్తారా?
సహజ నటి అనగానే టక్కున గుర్తొచ్చేది జయసుధ. తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె రాజకీయ తెరపై మాత్రం జనాన్ని మెప్పించలేకపోతున్నారట. రీల్ లైఫ్‌లో ఏం నటించినా మురిసిపోయే జనం... రియల్ లైఫ్‌లో మాత్రం సారీ అంటున్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి మరోసారి పోటీ చేస్తోన్న జయసుధకు ఎదురుగాలి ఓ ప్రభంజనంలా వీస్తోందని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుకోవటం గమనార్హం. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో వెండి తెర నుంచి రాజకీయ తెరపై జయసుధ ఆరంగేట్రం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఆమె గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఈ అయిదేళ్లలోనూ జయసుధ పార్టీ సహచరులతోనూ..కార్యకర్తలతోనూ అంటీ ముట్టనట్లు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నియోజకవర్గాన్ని జయసుధ చేసింది ఏమీ లేదంటూ స్థానికులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇక జయసుధ ఈసారి లోక్‌సభ సీటుపై కన్నేసినా ...కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు సికింద్రాబాద్ అసెంబ్లీకే టికెట్ కేటాయించింది. దాంతో జయసుధ ఎన్నికల ప్రచారం మొదలెట్టారు.అయితే ఈసారి మాత్రం ఆమె గెలుపు కష్టమేనని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. పార్టీ శ్రేణులే జయసుధ గెలుపుకు సమిష్టిగా కృషి చేసే పరిస్థితులు లేవని సమాచారం. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి త్రిముఖ పోటీ ఉండటంతో ఆమె ఈసారి గట్టెక్కేనా అనేది అనుమానమే. జయసుధ, సికింద్రాబాద్, కాంగ్రెస్, ప్రచారం, Jaya sudha, secunderabad, congress, compaigning -
‘బాబు’ ఫోన్లా... బాబోయ్...
*కడప అభ్యర్థిని ఖమ్మం వాళ్లు నిర్ణయించాలట!! *అభాసుపాలవుతున్న చంద్రబాబు ‘ఆన్లైన్’ ప్రణాళిక *ఖమ్మం వాసికి ఫోన్ చేసి పొద్దుటూరు అభ్యర్థిగా ఎవరుండాలని ఆరా *మల్లేల లింగారెడ్డి అయితే 1, వరదరాజుల రెడ్డి అయితే 2 నొక్కాలట *ఇవేం ఫోన్లురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్న ఖమ్మం వాసులు సాయంత్రం ఏడు గంటల సమయం... ఖమ్మం నగరంలోని ఓ చిరుద్యోగికి ఒక ఫోన్ వచ్చింది... నెంబర్ ఫీడ్ చేసి లేకపోయినా ఎవరో అని ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి టోన్. ముందుగా నమస్కారం అన్నారు. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు. వావ్.. మా అభ్యర్థిని మేమే నిర్ణయించే అవకాశం కల్పించారా అని ఆ చిరుద్యో గి ఆసక్తి కనబరిచాడు. ఖరాఖండిగా తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాడు. కానీ అతని ఆశ నిరాశే అయింది. బాబుగారు ఖమ్మంలోని ఈవ్యక్తికి ఫోన్ చేసి కడప జిల్లా పొద్దుటూరులో అభ్యర్థి ఎవరయితే బాగుంటుందని అడగడంతో అతను అవాక్కయ్యాడు. అవతలివైపు నుంచి బాబు గారు.. మీకు నచ్చిన అభ్యర్థి మల్లేల లింగారెడ్డి అయితే 1, వరదరాజుల రెడ్డి అయితే 2 అని నొక్కాలని పదే పదే అడుగుతుండడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడా చిరుద్యోగి. 14001281999 నెంబర్నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను అసలు నేను ఎందుకు ఎత్తానురా ‘బాబు’... నేను పొద్దుటూరు అభ్యర్థిని నిర్ణయించడం ఏంటి అని తల పట్టుకున్నాడతను. ఇతనే కాదు... ఖమ్మం జిల్లాలోని చాలా మందికి ఇదే విధమైన ఫోన్లు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మామూలు సమయాల్లో రింగ్టోన్లు, కంపెనీ ప్లాన్ల గురించి చెప్పడానికి వివిధ టెలికం అపరేటర్లు చేసే ఫోన్లతో చస్తుంటే... ఎన్నికల సమయంలో అర్థం పర్థం లేకుండా బాబుగారు ఫోన్ చేయడమేంటి.... కడప జిల్లా అభ్యర్థిని నిర్ణయించమని అడగమేంటి అని ప్రజానీకం నవ్వుకుంటున్నారు. -
మంగళవారం సెంటిమెంట్!
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలినా అభ్యర్థులు మాత్రం మంగళవారం ఎక్కడా ప్రచారం ప్రారంభించలేదు. అయితే గ్రామీణ స్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు డమ్మీ బ్యాలెట్ పేపర్లతో ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్య గుర్తును చూపిస్తూ ప్రచారం చేయటం ఆనవాయితీ. సోమవారం సాయంత్రం అధికారులు ఆయా పార్టీల అభ్యర్థులకు ఆల్ఫా బెటికల్ క్రమంలో వారి పేర్లను బ్యాలెట్ పేపర్లో సూచిస్తూ వివరాలు ఇచ్చారు. దీంతో అభ్యర్థులంతా మంగళవారం డమ్మీ బ్యాలెట్ ముద్రణ కోసం పరుగులు పెట్టారు. డమ్మీ బ్యాలెట్ పేపర్, సెంటిమెంట్ ఇలా రెండు అంశాలు ప్రచార ప్రారంభాన్ని ఒకరోజు వాయిదా వేశాయి.