
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని అడెపెల్లి గ్రామంలో శనివారం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఇరువర్గాల్లో పలువురికి గాయాలయ్యాయి. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రచార చిత్రాలను గోడలపై అంటించే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు కబీర్, షారూక్‌కు తలపై గాయాలయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వీరిని చికిత్స కోసం సిర్పూర్ ఆసుపత్రికి, కాగజ్‌నగర్‌కు తరలించారు. ఘర్షణ సమయంలో కాంగ్రెస్ నాయకులు దూషించారంటూ టీఆర్‌ఎస్ నాయకులు నాయిని సంతోష్, గడ్డం సత్తయ్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏఎస్సై జహీరుద్దీన్ మాట్లాడుతూ ఇరువర్గాల ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment