ప్రచారం.. కొత్త పుంతలు
సోషల్ మీడియాపై నేతల దృష్టి
ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్) ద్వారా విస్తృత ప్రచారం
ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.
ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.
‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.
వాయిస్ మెయిల్ కాల్స్‌తో ప్రచారం
రెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్‌బు క్, ట్విట్టర్‌ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్‌నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.
దీనికి తోడు అభ్యర్థులు ఫేస్‌బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్‌నెట్‌పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్‌లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.
దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్‌మెయిల్స్, ఫోన్‌కాల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment