
బావా, బావమరిది ప్రచారాల్లో అపశ్రుతి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారంలో సోమవారం అపశ్రుతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు ప్రచార రథం అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు అనంతపురం జిల్లా హిందుపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ కాన్వాయ్ తగిలి ఒకరు గాయపడ్డారు. అయితే ఆ విషయాన్ని బాలయ్య ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.