'ఈ లొల్లి మ‌న‌కొద్దు బిడ్డో..' జ‌ర ఆలోచించు! | Election Campaigning | Sakshi
Sakshi News home page

'ఈ లొల్లి మ‌న‌కొద్దు బిడ్డో..' జ‌ర ఆలోచించు!

Published Sat, Nov 25 2023 1:56 PM | Last Updated on Sat, Nov 25 2023 1:56 PM

Election Campaigning - Sakshi

సాక్షి, రాజ‌న్న సిరిసిల్ల‌/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.'

తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? 
కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి.
తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు.
కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా.
తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా.
కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే.
తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా.
కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. 
తల్లి :  బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా.
కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్‌.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. 
తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా.
కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం.
ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement