
సాక్షి,బెంగళూరు: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రము ఖ నటి హరిప్రియ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ధర్మగిరి మంజునాథస్వామి దేవాలయంలో ఓ కొత్త చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే నిర్ణయించుకున్నామని ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి తరపున ప్రచారం చేయాల్లో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
బహుభాష నటుడు ఉపేంద్ర స్థాపించిన ప్రజా పక్ష పార్టీ తరపున కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని, దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం మాత్రమే నిర్వహిస్తామని, తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన సొంత పట్టణం చిక్కబళ్లాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment