‘వి’ సింబల్ అనగానే తెలుగులో విక్టరీ వెంకటేశ్ గుర్తుకురాక మానరు. తమిళంలో విక్టరీకి చిరునామా అనదగ్గ హీరో అజిత్. వరుస విజయాలతో దూసుకెళోతున్న ఈ హీరోకీ, దర్శకుడు శివకీ, ‘వి’కీ లింకుంది. అసలు మేటర్ ఏంటంటే.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించాయి. ఇప్పుడు మరో ‘వి’ కోసం.. అదేనండీ విక్టరీ కోసం ఈ ఇద్దరూ చేతులు కలిపారని కోలీవుడ్ సమాచారం.
ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా టైటిల్స్ అన్ని ‘వి’ లెటర్‌తోనే స్టార్టయ్యాయి. దీంతో రాబోయే సినిమా టైటిల్‌ని కూడా ‘వి’ అక్షరంతోనే స్టార్ట్ చేస్తారేమోనన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘వి’ అక్షరంతో టైటిల్ పెట్టకపోయినా సక్సెస్ గ్యారంటీ అని, ఎందుకంటే.. అజిత్–శివ చేస్తే సక్సెస్‌ఫుల్ సినిమాయే చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. అన్నట్లు ఇంకోమాట.. హీరో అజిత్ ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ వేదా’ సినిమా దర్శక ద్వయం పుష్కర్–గాయత్రిల డైరెక్షన్‌లో నటించనున్నారనే వార్త నిజం కాదట. ‘‘అజిత్ సార్‌తో సినిమా ఇంకా సెట్ కాలేదే. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావాలని తాము కోరుకుంటున్నాం’’ అని వాళ్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment