నయన్‌ ఇన్‌ | Nayanthara to team up with Rajinikanth once again | Sakshi
Sakshi News home page

నయన్‌ ఇన్‌

Published Sat, Feb 1 2020 3:44 AM | Last Updated on Sat, Feb 1 2020 3:44 AM

Nayanthara to team up with Rajinikanth once again - Sakshi

రజనీకాంత్, నయనతార

‘చంద్రముఖి’ (2005), ‘దర్బార్‌’ (2020) చిత్రాల్లో రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. రజనీ శివాజీ   (2007), ‘కుశేలన్‌ ’ (2008) (తెలుగులో ‘కథానాయకుడు’) చిత్రాలలో ఆయనతో కాలు కదిపారు నయనతార. ఇప్పుడు రజనీ, నయనతార మరోసారి స్క్రీన్‌  షేర్‌ చేసుకోనున్నారు. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాష్‌ రాజ్‌ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి నయనతారను తీసుకున్నారు. అయితే నయనతార రజనీకాంత్‌కు జోడిగా నటించనున్నారా? లేక ఏదైనా కీలక పాత్ర చేయబోతున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. తర్వాతి షెడ్యూల్‌ చెన్నైలో ఈ నెల ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement