షూటింగ్‌లో హీరోకు గాయాలు, ఆపరేషన్
సాక్షి, చెన్నై: తమిళ ప్రముఖ హీరో అజిత్‌కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆయనకు ఇంతకు ముందు కూడా పలు మార్లు శస్త్ర చికిత్సలు జరిగిన విషయం తెలిసిందే. హీరో అజిత్ యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తనే నటించడానికి ప్రయత్నిస్తారు. ఇటీవల విడుదలైన ‘వివేగం’ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి అజిత్ ముందుగానే చాలా కసరత్తులు చేశారు. తన బాడీని సిక్స్‌పాక్‌కు మలుచుకుని నటించారు. బల్గేరియాలో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో స్టంట్ మాస్టర్‌తో పోరాడే సన్నివేశంలో నటిస్తుండగా అజిత్ భుజానికి బలమైన గాయం అయ్యింది.
వెంటనే అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారట. అయితే నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారట. చెన్నైకి తిరిగొచ్చిన అజిత్ ఇంటిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. అలాంటిది ఈ నెల 7న ఆయన నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు వెల్లడించారు. రెండు నెలల పాటు అజిత్‌కు విశ్రాంతి అవసరం అని సలహా ఇవ్వడంతో ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.