
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: వేలూరు జిల్లాలో బాలికను గర్భవతిని చేసిన మాజీ సైనికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం ఇందిరా నగర్‌కు చెందిన శేఖర్ (56). మాజీ సైనిక వీరుడైన అతను ప్రస్తుతం ఇంట్లో బియ్యపు పిండి రుబ్బు యంత్రం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఉన్నారు. ఈ క్రమంలో శేఖర్ తమ ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై ఏడు నెలల క్రితం లైంగిక దాడి చేశాడు.
అనారోగ్యం ఏర్పడడంతో బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు విద్యార్థిని 7 నెలల గర్భిణి అని తేల్చారు. తల్లిదండ్రులు విద్యార్థిని వద్ద విచారణ చేయగా శేఖర్ తనపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. శేఖర్‌ను ప్రశ్నించగా.. బాలికకు గర్భస్రావం చేసేందుకు రూ. 10 లక్షలు ఇస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గుడియాత్తం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు శేఖర్‌ను అరెస్టు చేసి వేలూర్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment