వేలూరు: తమ ప్రేమకు ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో ప్రేమికులు ఆలయంలో పెళ్లి చేసుకున్నా రు. అయితే గంటకే ప్రియురాలిని వదిలి ప్రియుడు కుటుంబసభ్యులతో వెళ్లాడు. ఈ ఘటన శుక్రవా రం గుడియాత్తంలో జరిగింది. చెన్నైకి చెందిన సెల్వ బాలాజి(32) వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిప ల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. సెదుకరై వినాయక వీధికి చెందిన రోజా (20) అదే కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుంది. సెల్వ బాలాజి, రోజా ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నా రు. వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో వ్యతి రేకించారు. ఇదిలా ఉండగా శుక్రవారం యథావిధిగా సెల్వ బాలాజి కార్యాలయానికి చేరుకున్నాడు. కొద్ది సమయంలోనే ప్రియురాలు రోజాతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి రోజా బ్లేడుతో చేతిని కోసుకుంది.
దీంతో రోజాను పళ్లిగొండలోని రంగనాథర్ ఆలయానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కమిషనర్ కుటుంబ సభ్యులు సెల్వ బాలాజీని కిడ్నాప్ చేసినట్లు గుడియాత్తం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోజా కుటుంబసభ్యులు కూడా రోజాను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇద్దరూ రోజా ఇంటికి వెళ్లారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ గుడియాత్తం మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే సెల్వబాలాజీని మాత్రం వారి కుటుంబసభ్యులు వెంటబెట్టుకొని వెళ్లిపోయారు. దీంతో తన భర్తను తనతో పంపాలని రోజా వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న గుడియాత్తం మహిళా పోలీసులు కమిషనర్ సెల్వ బాలాజీని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరితో చర్చించి నిర్ణయం తీసుకోమన్నారు. రోజాను వదిలిపెట్టి కమిషనర్ కారులో చెన్నైకి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిపోయారు. అనంతరం రోజాను వారి కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment