
తుమకూరు(బెంగళూరు): తిపటూరు తాలూకాలోని హిండిస్కెర గ్రామంలో పెళ్లి చేసుకున్న కొన్నిరోజులకు ప్రియుడు కమ్ వరుడు పరారయ్యాడు. వివరాలు.. తాలూకాకు చెందిన వేర్వేరు కులాల వారైన నిఖిల్, చైత్ర ఏడాదిగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తురువెకెరెలో ఒక మొబైల్ షోరూంలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఫిబ్రవరి 4వ తేదీన గుడిలో దండలు మార్చుకుని, మరో మూడు రోజులకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఇండిస్కెరె గ్రామంలో ఇల్లు బాడుగకు తీసుకుని కాపురం పెట్టారు. ఫిబ్రవరి 10న తల్లికి అనారోగ్యంగా ఉందని, చూసివస్తానని చెప్పి నిఖిల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్నిరోజులైనా జాడ లేకపోవడంతో చైత్ర అతనికి కాల్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో పరవగొండనహళ్ళిలో ఉన్న నిఖిల్ ఇంటికి చైత్ర వెళ్లింది. నిఖిల్ తండ్రి బసవరాజు ఆమెను దూషిస్తూ తరిమికొట్టాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం కిబ్బనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: Hyderabad Crime: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది
Comments
Please login to add a commentAdd a comment