
పెళ్లినాటి ఫొటో
యశవంతపుర(కర్ణాటక): నర్సును ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చాటేశాడు. ఈ ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హలవాగలు గ్రామంలో జరిగింది. గిరీశ్ బీఎంఎస్ చదివి క్లినిక్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన త్రివేణి గిరీశ్ వద్ద నర్సుగా పని చేస్తుంది.
ఈక్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కురవత్తి బసవణ్ణ దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ ఉంది. ఇటీవల డాక్టర్ తీరులో మార్పు వచ్చింది. గిరీశ్ మరో పెళ్లి చేసుకున్నట్లు అరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో త్రివేణి వద్దకు రావడం మానేశాడు. దీంతో త్రివేణి దావణగెరె ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
చదవండి: నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రిలో ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment