12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి | Husband got his wife marriage with boyfriend | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల క్రితం ప్రేమపెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి

Published Thu, Dec 19 2024 5:17 PM | Last Updated on Thu, Dec 19 2024 6:00 PM

Husband got his wife marriage with boyfriend

'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు  లాటిన్‌ కవి జువెనాల్‌. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్‌గా మారింది. 

పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్‌ ఏంటంటే..12 ఏళ్ల క్రితం  ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఘర్‌  కా కాలేశ్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.  బిహార్‌లో ఈ  ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు.  దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. 
 

 ;

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement