
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్‌చార్జ్‌పై కలెక్టర్ సీరియస్)
► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి.
► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి.
► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment