Anantapur ZP Chairman
-
ఎంపీ తలారి లేఖకు స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్) ► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి. ► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి. ► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు. -
‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’
అనంతపురం: జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ చమన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జెడ్పీ నిధుల కోసం నారా లోకేశ్ తో చర్చిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రభుత్వంలో ఏ పదవిలో లేని లోకేశ్ తో నిధుల గురించి చర్చించామని చమన్ వెల్లడించడంతో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అవాక్కయ్యారు. జిల్లా పరిషత్ నిధుల గురించి లోకేశ్ చర్చించడమేమిటని సభ్యులు గుసగుసలాడారు. లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనడానికి చమన్ వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. కాగా, జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చాంద్ బాషాకు చేదు అనుభవం ఎదురైంది. కదిరి నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయనను నిలదీశారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.