‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’ | Anantapur ZP Chairman Controversial Comments | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’

Published Fri, Jan 20 2017 8:29 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’ - Sakshi

‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’

అనంతపురం: జిల్లా పరిషత్‌ సమావేశంలో చైర్మన్‌ చమన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జెడ్పీ నిధుల కోసం నారా లోకేశ్‌ తో చర్చిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రభుత్వంలో ఏ పదవిలో లేని లోకేశ్‌ తో నిధుల గురించి చర్చించామని చమన్‌ వెల్లడించడంతో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అవాక్కయ్యారు. జిల్లా పరిషత్‌ నిధుల గురించి లోకేశ్‌ చర్చించడమేమిటని సభ్యులు గుసగుసలాడారు. లోకేశ్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనడానికి చమన్ వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు.

కాగా, జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు చేదు అనుభవం ఎదురైంది. కదిరి నియోజకవర్గంలో  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయనను నిలదీశారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement