
సాక్షి, అనంతపురం: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను శుక్రవారం ఉదయం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ మరింత పెరిగింది. కరోనా పరీక్షలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ రంగయ్య పేర్కొన్నారు. చదవండి: సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..!
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలు అర్థరహితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు' అని తెలిపారు.
కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలు సీఎం జగన్‌ను ఫాలో అవుతున్నాయి. సీఎం జగన్‌పై ప్రజలకు విశ్వాసం పెరిగింది అని అనంత వెంకటరామి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది..
Comments
Please login to add a commentAdd a comment