తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు.
తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్‌యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్‌మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment