భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
మహీంద్రా బొలెరో (Mahindra Bolero)
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).
కియా సోనెట్ (Kia Sonet)
కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)
మహీంద్రా బొలెరో నియో 100 హార్స్‌పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మహీంద్రా XUV 3ఎక్స్ఓ
XUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.
ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?
డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్
కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment