kia cars
-
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?
-
అసలు ఈ కియా కారు కథేంటి..
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.దిక్కుమొక్కు లేక..ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.అసలు ఈ కియా కారు కథేంటి..ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మగ్గుతోంది.కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. -
డీపీఎఫ్ సమస్య: కస్టమర్‌కు షాకిచ్చిన కంపెనీ
కియా సెల్టోస్ దేశంలోని అత్యుత్తమ డీజిల్ కార్లలో ఒకటి. బిఎస్ 6 నిబంధనల ప్రకారం.. ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) ఆధారిత ఉద్గార నియంత్రణ వ్యవస్థతో వస్తుంది. ఈ హార్డ్‌వేర్ కొంత ఖరీదైనది. ఇలాంటి క్యాటలిక్ కన్వర్టర్ విఫలం కావడంతో దానిని భర్తీ చేయడానికి 1.57 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కస్టమర్‌కు డీలర్షిప్ ఎస్టిమేట్ పంపించింది.ఈ ఘటన త్రిసూర్‌లోని వదనపల్లిలో చోటుచేసుకుంది. ఇంచియాన్ కియా డీలర్ ఒక ఎస్టిమేట్ పంపిస్తూ డీపీఎఫ్ భర్తీకి రూ. 1.57 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించింది. దీనిని కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ధర చాలా ఎక్కువని, రూ. 60వేలు నుంచి రూ. 70వేలు మధ్య ఉంటే న్యాయంగా ఉండేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.చాలా డీజిల్ కార్లలో డీపీఎఫ్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే ఇది ఎగ్జాస్ట్ వాయువులను లేదా హానికర వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భర్తీ చేసుకుంటూ ఉండాలి.డీజిల్ కార్లలోని డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ రక్షణకు సాధారణ డీజిల్ కాకుండా.. ఎక్స్‌ట్రాగ్రీన్ డీజిల్ ఉపయోగించడం ఉత్తమం. ఇది డీపీఎఫ్ జీవితకాలాన్ని పెంచుతుంది. డీపీఎఫ్ సమర్థవంతగా పనిచేస్తే.. ఎగ్జాస్ట్ వాయువులో హాని కలిగించే వాయువులు తక్కువగా ఉంటాయి. -
ఏడాది తర్వాత మార్కెట్లో లాంచ్ అయిన కారు.. ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో నాల్గవ తరం కియా కార్నివాల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది కేవలం డీజిల్ ఇంజన్‌తో 7 సీటర్‌గా మాత్రమే లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశానికి దిగుమతి అవుతుంది.సరికొత్త కియా కార్నివాల్ భారతదేశంలో తయారైతే ధర కొంత తగ్గుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా ఉన్న కార్నివాల్.. కోసం కంపెనీ రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా హుందాగా ఉంటుంది.టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్న ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.2024 కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్లను పొందుతుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవేకొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారుకు మూడు సంవత్సరాల ఫ్రీ మెయినెనెన్స్, వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి అందిస్తుంది. -
4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే..
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది. -
మైమరిపిస్తున్న కియా కొత్త కార్లు - (ఫొటోలు)
-
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
Hyderabad: ఇదేం ట్రెండ్రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్ చేసిన జంట
హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది. శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ వేపై ఓ కియా కారు శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్‌లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్‌ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
మార్కెట్లో కియా నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!) కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్: కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్హోల్డర్లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్: కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి. -
Kia Carnival facelift: కియా మోటార్స్ నుంచి కొత్త కారు.. భారత్‌కి వస్తుందా?
భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ & ఫీచర్స్: కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు. నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్: కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది. (ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..) లాంచ్ టైమ్: కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు. అంచనా ధర: కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి. -
2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' భారతీయ మార్కెట్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేటెడ్ కారెన్స్ విడుదల చేసింది. ఇది అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: అప్డేటెడ్ కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలు దాని మునుపటి మోడల్ కంటే రూ. 50,000, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000 ఎక్కువ. ఇంజిన్ ఆప్సన్స్: కొత్త కియా కారెన్స్ E20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్డ్) కంప్లైంట్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ రాబోయే BS6 ఫేజ్ 2 & RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. (ఇదీ చదవండి: మారుతి బ్రెజ్జా సిఎన్జి కావాలా.. ఇప్పుడే బుక్ చేసుకోండి!) డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్: 2023 కియా కారెన్స్ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 4.2 ఇంచెస్ కలర్ MIDతో 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్: ఆధునిక కాలంలో డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలను కొనుగోలుచేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆస్కతి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. 2023 కారెన్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: అప్డేటెడ్ కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరల పరంగా ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉంటుంది. ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.41 లక్షల నుంచి రూ. 14.67 లక్షల వరకు ఉంది. కావున ఈ విభాగంలో కారెన్స్ ధర కొంత ఎక్కువగానే ఉంది, కానీ రానున్న కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. -
పెద్దపల్లి: సాగర్ రోడ్డులో పేలిన కియా కారు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య ఫాం హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కియా కారు సెంట్రల్ లాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా వాహనంలోంచి భారీ శబ్దం రావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న రెండు కార్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. -
కియా ఇండియా కీలక ప్రకటన.. ఇకపై సెల్టోస్ కార్లలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది. భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. -
సరికొత్త రికార్డ్..దుమ్మురేపుతున్న కియా కార్ల అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా గడిచిన మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని అధిగమించింది. తక్కువ కాలంలో ఈ ఘనతను సాధించిన కార్ల తయారీ కంపెనీ తామేనని కియా వెల్లడించింది. అలాగే గడిచిన నాలుగున్నర నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఎగుమతులతో కలిపి ఈ మూడేళ్లలో కంపెనీ 6,34,224 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సెల్టోస్ మోడల్‌దే ప్రధాన వాటాగా ఉంది. అంతర్జాతీయంగా కియా మొత్తం అమ్మకాల్లో భారత వాటా 6 శాతానికి పైగా ఎగసింది. ‘భారత్‌లో మూడేళ్లలో ట్రెండ్ సృష్టించాం. స్పూర్తిదాయక బ్రాండ్‌గా స్థిరపడటమేగాక నూతన సాంకేతికతలను స్వీకరించడంలో సైతం నాయకత్వం వహించాం’ అని కియా ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 339 నుంచి డిసెంబర్ నాటికి 400లకు చేర్చనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో కియా తయారీ కేంద్రం ఉంది. -
AP: అమెరికా లాంటి అగ్ర దేశాలకు ‘అనంత’ ఉత్పత్తులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది కరువు. కానీ అది గతం. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు ఖండాంతరాలకు వెళ్లింది. అమెరికా లాంటి అగ్రదేశాలకు అనంత ఉత్పత్తులు చేరుతున్నాయి. ఉద్యాన పంటల్లోనే ఇప్పటివరకూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జిల్లా తాజాగా కార్లు, మందులు, రెడీమేడ్ గార్మెంట్స్ వంటి వాటిలోనూ ముందంజ వేసింది. పారిశ్రామిక ప్రగతికి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎగుమతుల కారణంగా విదేశీ మారకంతో పాటు ఇక్కడ ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. వేలాదిమంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక్కడ తయారై ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల విలువ ఏటా రూ.5 వేల కోట్లకు పైనే ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు ఎగుమతి అయిన కియా కార్లు అక్షరాలా 40,440. జిల్లాలో తయారై మన దేశంలో అమ్ముడైన కార్ల సంఖ్య 1,55,678గా ఉంది. అమెరికాలో మన కార్లే అమెరికా వంటి అగ్రదేశంలోనూ మన జిల్లాలో తయారైన ‘కియా’ కార్లు తిరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. కార్లే కాదు జిల్లాలోని రాచనాపల్లి వద్ద తయారవుతున్న సిఫ్లాన్ డ్రగ్స్ (పశువుల మందులు) పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, టర్కీ, ఐర్లాండ్, ఉరుగ్వే, నెదర్లాండ్స్, పాకిస్తాన్ వంటి దేశాలకు వెళుతున్నాయి. జిల్లాలోని పరిగి వద్ద ఇండియన్ డిజైన్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసే రెడీమేడ్ దుస్తులు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రమారమి రూ.52.88 కోట్ల విలువైన దుస్తులు ఎగుమతయ్యాయి. హిందూపురం పట్టణ పరిధిలోని తూముకుంట వద్ద ఉన్న విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి పిస్టన్ రాడ్స్..యూరప్‌తో పాటు ఇజ్రాయిల్ తదితర దేశాలకు వెళుతున్నాయి. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు జిల్లాలో ఎవరైనా ముందుకొచ్చి యూనిట్లు పెడితే వారికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. ఇన్సెంటివ్‌లు వచ్చేలా చూస్తున్నాం. ముఖ్యంగా లార్జ్‌స్కేల్ యూనిట్లపై దృష్టి సారిస్తున్నాం. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. – నాగలక్ష్మి సెల్వరాజన్, కలెక్టర్ -
కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
కార్ల తయారీ సంస్థ కియా ఇండియా భారత్ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరులో కియా మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈనెల 15న దేశీయ మార్కెట్లో కియా కారెన్స్‌ను లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ కారును కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు డీలర్ల వద్ద రూ 25,000 చెల్లించి కియా కారెన్స్‌ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కియా కారెన్స్ ఫీచర్లు 6,7 సీట్లలో లభించే కియా కారెన్స్ కారులో స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, వంటి ఫీచర్లతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వంటి ఐదు ట్రిమ్స్లు ఈ కారులో అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు బాస్ స్పీకర్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎయిర్ ప్యూరిఫైర్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఇక కియా కారెన్స్ రూ 12 లక్షల నుంచి రూ 18 లక్షల వరకూ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. -
చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి మాజీ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చెర్మన్ చాముండేశ్వరనాథ్ కియా కారును బహుమతిగా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కియా సోనెట్ కారును ఆయన ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవీతో పాటు కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు.. జిమ్నాస్ట్ అరుణారెడ్డికి కారు కీని అందజేశారు. ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో అరణా రెడ్డి కాంస్యం సాధించింది. మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల అరుణ ఈజిప్ట్ కైరోలో మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. -
నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!
Here Are the Top 10 Best-Selling Cars From November: భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్ల జాబితాలో ఏడు స్థానాలను మారుతి సుజుకి ఇండియా ఆక్రమించింది. ఇండో-జపనీస్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ నెలలో మొత్తంగా 9 శాతం అమ్మకాలు పడిపోయినప్పటికీ, జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిగిలిన మూడు హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ కు చెందిన ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. నవంబర్‌లో భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మారుతి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. మారుతి నవంబర్ 2021లో 16,853 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. ఇది నవంబర్ 2020లో విక్రయించిన 16,256 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ. 2. మారుతి స్విఫ్ట్ ఈ జాబితాలో మారుతి సుజుకికి వచ్చిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందినప్పటికి అమ్మకాల పరంగా దూసుకెళ్లింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో స్విఫ్ట్ 14,568 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. 3. మారుతి ఆల్టో ఈ జాబితాలో మూడవ స్థానంలో కూడా మారుతి సుజుకికి చెందిన మారుతి ఆల్టో నిలిచింది. ఇది అక్టోబర్ నెలలో అగ్ర స్థానాన్ని కలిగి ఉంది, కానీ ఈసారి దీనిని వ్యాగన్ఆర్ ఓడించింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో 13,812 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,321 యూనిట్ల కంటే తక్కువ. 4. మారుతి విటారా బ్రెజ్జా విటారా బ్రెజ్జా, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్యువీ కారు. మారుతీ గత నవంబర్ నెలలో 10,760 యూనిట్ల బ్రెజ్జాను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించగలిగిన 7.838 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. మారుతి రాబోయే రోజుల్లో బ్రెజ్జా యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, కార్‌మేకర్ ఇంకా నిర్దిష్ట లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు. 5. హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో కనిపించిన మొదటి నాన్-మారుతి కారు హ్యుందాయ్ క్రెటా మాత్రమే. గత కొంత కాలంగా చిప్ సంక్షోభం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ హ్యుందాయ్ నవంబర్‌లో 10,300 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్యువీని విక్రయించింది. గతేడాది నవంబర్‌లో హ్యుందాయ్ క్రెటా 12,017 యూనిట్లను విక్రయించింది. 6. మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 6వ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. మారుతి నవంబర్ 2020లో 17,872 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021లో 9,931 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ కారు కూడా లాటిన్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందింది. 7. టాటా నెక్సన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక కారు టాటా మోటార్స్ నెక్సాన్ మాత్రమే. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యువి300 కార్ల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. 2021 నవంబరులో టాటా 9,831 యూనిట్ల నెక్సన్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 10,096 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. 8. మారుతి ఈఈసీఓ ఈ జాబితాలో కనిపించిన ఏకైక వ్యాన్ మారుతి ఈఈసీఓ. మారుతి నవంబరులో 9,571 యూనిట్ల ఈకో కార్లను విక్రయించింది, ఇది సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఈఈసీఓ నాన్ కార్గో వేరియెంట్ల ధరలను మారుతి రూ.8,000 పెంచింది. ధరల పెంపు నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. 9. మారుతి ఎర్టిగా మారుతి ఎర్టిగా నవంబరులో ఏడు సీట్ల ఎంపివి విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి నవంబరులో 8,752 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది, అక్టోబర్ నెలలో విక్రయించిన యూనిట్ల కంటే గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది. 10. కియా సెల్టోస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 10వ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. 2020 నవంబరులో విక్రయించిన 9,205 యూనిట్లతో పోలిస్తే కియా నవంబర్ 2021లో 8,659 యూనిట్ల సెల్టోస్ ఎస్‌యూవీని విక్రయించింది. -
కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు
Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్ వెహికల్స్ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోనే కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్ అమ్మకాలు అదుర్స్ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వాస్తవానికి కరోనా ఫస్ట్ వేవ్ ముగిసన తర్వాత ఆటోమైబైల్ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టియో జిన్ పార్క్ తెలిపారు. టెక్నాలజీ అండతో.. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్ వెహికల్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్లో టెక్నాలజీలో సోనెట్ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎమ్), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), పెడల్ షిప్టర్స్, వాయిస్ కమాండ్ ఆపరేటెడ్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు కియా సోనెట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్ రిలీజ్ అవగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 మేలో మార్కెట్లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
కొత్త కార్ల ‘పండుగ’!
రోనా కష్టకాలంలోనూ కొత్త కార్లు రోడెక్కడానికి సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను సెంటిమెంట్‌ను ఆసరా చేసుకొని ప్రముఖ కార్ల కంపెనీలు భారత మార్కెట్లోకి దాదాపు 12రకాల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీ)మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లో ఈ ఆగస్ట్ 22న వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. సాధారణంగా కార్ల కంపెనీలు పండుగ సీజన్‌ను క్యాష్‌ను చేసుకునేందుకు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ఈసారి కంపెనీలకు పండుగ సీజన్ మరింత కీలకం కానుంది. కరోనా అనంతరం కార్లకు పెరిగిన డిమాండ్‌తో పాటు అంటువ్యాధి కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈసారి విక్రయాలు భారీగా ఉండవచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి 4 మోడళ్లు పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ ఎస్యూవీ విభాగంలో 4మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కంపెనీ తన ప్లాంట్లలో 3 షిఫ్టుల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ‘‘ఈ ఆగస్ట్‌లో కంపెనీ నిర్వహణ సామర్థ్యం 90–92శాతంగా ఉంది. రానున్నరోజుల్లో మరింత పెంచే అవకాశం ఉంది. సెప్టెంబర్ నాటికి ప్రీ–కోవిడ్ స్థాయి ఉత్పత్తిని అందుకుంటాము’’ అని హ్యుందాయ్ మోటర్ ఇండియా తెలిపింది. టొయోటా నుంచి బడ్జెట్ కారు: దీపావళి పండుగ సందర్భంగా జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ భారత మార్కెట్లోకి బడ్జెట్ కారును విడుదల చేయనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ’అర్బన్ క్రూయిజర్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ మోడల్ కారు ధర రూ.8నుంచి రూ. 11లక్షల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అం చనా. కొత్తగా కారును కొనాలనుకునేవారు ఈ మో డల్ పట్ల ఆకర్షితులవుతారని కంపెనీ ఆశిస్తోంది. కియా నుంచి కూడా... దక్షిణ కొరియా దిగ్గజం కియా మోటర్స్ కూడా వచ్చే సెప్టెంబర్‌లో కాంపాక్ట్ ఎస్యూవీ ‘సోనెట్’ను విడుదల చేయనుంది. భారత్‌లో సెల్టోస్, కార్నివాల్ తర్వాత ‘సోనెట్’ మూడో మోడల్ కావడం విశేషం. దేశీయ మార్కెట్లో హ్యుం దాయ్ వెన్యూ, మారుతీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ.7నుంచి రూ.12లక్షల మధ్య ఉండొచ్చు. ఆగస్ట్ 15న మహీంద్రా థార్ లాంచ్ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కంపెనీ తన కొత్త మోడల్ 2020 థార్ మోడల్ కారును ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన 2020 థార్ మోడల్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ థార్ మోడల్ కారు డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లభిస్తోంది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ సబ్–కాంపాక్ట్ విభాగంలో తన కొత్త మోడల్ కారును దీపావళికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అలాగే ఎంజీ గ్లస్టర్, డస్టర్ ఎస్‌యూవీలు ఈ పండుగ సీజన్లో భారత్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. -
5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు
ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్ మిడ్–సైజ్ ఎస్యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును చూసి మరిన్ని మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్పో 2020లో వీటిని ప్రదర్శించనుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు కార్నివల్ ఎంపీవీ కార్లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించింది. -
ఉపాధి 'కియా'
కియా ప్రాంగణం నిండైనా తెలుగుదనంతో వెలుగులీనింది. సంప్రదాయనృత్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. యంగ్ అండ్ డైనమిక్ సీఎం అంటూ కియా ప్రతినిధులు కీర్తించారు. కియా గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. సెల్టోస్ కారుపై ఆటోగ్రాఫ్ చేశారు. ఆ తర్వాత బ్యాటరీ కారులో కియా ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి అవకాశాలకు కియా పరిశ్రమతో ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. ఎప్పటిలాగే వైఎస్ జగన్ రాక అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. దారిపొడవునా జై జగన్ నినాదం హోరెత్తింది. అనంతపురం: పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని.. కియా మోటార్స్‌లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే మరిన్ని ఉద్యోగాలు జిల్లావాసులకు దక్కుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కియా మోటార్స్ ఏర్పాటు చేసిన భారీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి (గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ) సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గన్నవరంవిమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం 10.52 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు రత్నాకర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మెహతా, కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య, ఎస్కేయూ వీసీ జయరాజ్, అఖిలభారత చేనేత బోర్డు ప్రతినిధి కేఎన్‌మూర్తి, స్థానిక నాయకులు సోమశేఖర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్నారు. కియా మోటార్స్ కార్ల తయారీ యూనిట్‌లోని అన్ని విభాగాలను ఈ సందర్భంగా సీఎం సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగించారు. సభ అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్‌రెడ్డి.. ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, వైటీ ప్రభాకర్‌రెడ్డి, మాజీమంత్రి షాకీర్, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, అనంతపురం, హిందూపురం పార్లమెంటు అ«ధ్యక్షులు నదీంఅహమ్మద్, నవీన్‌నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది. ప్లాంట్ పరిశీలించిన సీఎం.. కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి కియా ప్లాంటు వద్దకు వచ్చారు. ప్లాంటులో కార్ల తయారీ యూనిట్‌కు సంబంధించిన అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్ తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల్లో 40,649 కార్ల విక్రయం కియా ప్లాంటులో తయారైన సెల్టోస్ కారుకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని హన్ తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 6,046 బుకింగ్స్ వచ్చాయన్నారు. గత నాలుగు నెలల్లోనే 40,649 కార్లను విక్రయించినట్లు తెలిపారు. కొరియా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భారత్‌లో కొరియా రాయబారి బోంగో కిల్‌షిన్ చెప్పారు. కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్ షిమ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కియా కార్ల గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న కియా సంస్థ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన కియా ప్రతినిధులు