5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు | Sales Of 50 Thousand KIA Cars Within 5 Months | Sakshi
Sakshi News home page

5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు

Published Mon, Jan 27 2020 5:11 AM | Last Updated on Mon, Jan 27 2020 5:11 AM

Sales Of 50 Thousand KIA Cars Within 5 Months - Sakshi

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును చూసి మరిన్ని మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్‌పో 2020లో వీటిని ప్రదర్శించనుంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీతో పాటు కార్నివల్‌ ఎంపీవీ కార్లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement