కియా సెల్టోస్ దేశంలోని అత్యుత్తమ డీజిల్ కార్లలో ఒకటి. బిఎస్ 6 నిబంధనల ప్రకారం.. ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) ఆధారిత ఉద్గార నియంత్రణ వ్యవస్థతో వస్తుంది. ఈ హార్డ్‌వేర్ కొంత ఖరీదైనది. ఇలాంటి క్యాటలిక్ కన్వర్టర్ విఫలం కావడంతో దానిని భర్తీ చేయడానికి 1.57 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కస్టమర్‌కు డీలర్షిప్ ఎస్టిమేట్ పంపించింది.
ఈ ఘటన త్రిసూర్‌లోని వదనపల్లిలో చోటుచేసుకుంది. ఇంచియాన్ కియా డీలర్ ఒక ఎస్టిమేట్ పంపిస్తూ డీపీఎఫ్ భర్తీకి రూ. 1.57 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించింది. దీనిని కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ధర చాలా ఎక్కువని, రూ. 60వేలు నుంచి రూ. 70వేలు మధ్య ఉంటే న్యాయంగా ఉండేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
చాలా డీజిల్ కార్లలో డీపీఎఫ్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే ఇది ఎగ్జాస్ట్ వాయువులను లేదా హానికర వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భర్తీ చేసుకుంటూ ఉండాలి.
డీజిల్ కార్లలోని డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ రక్షణకు సాధారణ డీజిల్ కాకుండా.. ఎక్స్‌ట్రాగ్రీన్ డీజిల్ ఉపయోగించడం ఉత్తమం. ఇది డీపీఎఫ్ జీవితకాలాన్ని పెంచుతుంది. డీపీఎఫ్ సమర్థవంతగా పనిచేస్తే.. ఎగ్జాస్ట్ వాయువులో హాని కలిగించే వాయువులు తక్కువగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment