![Telangana: Car Blast , Fire Accident In Farm House Peddapalli - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/9/fire1.jpg.webp?itok=gItAZ3kK)
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య ఫాం హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కియా కారు సెంట్రల్ లాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా వాహనంలోంచి భారీ శబ్దం రావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న రెండు కార్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment