హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్‌లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది.
భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment