అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి మాజీ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చెర్మన్ చాముండేశ్వరనాథ్ కియా కారును బహుమతిగా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కియా సోనెట్ కారును ఆయన ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవీతో పాటు కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు.. జిమ్నాస్ట్ అరుణారెడ్డికి కారు కీని అందజేశారు. ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో అరణా రెడ్డి కాంస్యం సాధించింది.
మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల అరుణ ఈజిప్ట్ కైరోలో మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment