aruna reddy
-
ఓటు హక్కు వినియోగించుకున్న సుధామూర్తి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి
-
జిమ్నాస్ట్ అరుణ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ) సదరు కోచ్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. జీఎఫ్ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. -
జిమ్నాస్ట్ అరుణా రెడ్డికి 5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. -
చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి మాజీ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చెర్మన్ చాముండేశ్వరనాథ్ కియా కారును బహుమతిగా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కియా సోనెట్ కారును ఆయన ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవీతో పాటు కాకినాడ పోర్టు చైర్మెన్ కేవీ రావులు.. జిమ్నాస్ట్ అరుణారెడ్డికి కారు కీని అందజేశారు. ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో అరణా రెడ్డి కాంస్యం సాధించింది. మోకాలి సర్జరీ తర్వాత ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన 25 ఏళ్ల అరుణ ఈజిప్ట్ కైరోలో మంగళవారం ముగిసిన ఫారోస్ కప్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరీగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోరుతో టాప్ప్లేస్ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవసం చేసుకుంది. ఇక, ఫ్లోర్ ఈవెంట్ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్ ప్లేస్‌తో ఇంకో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌కప్‌లో బ్రాంజ్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసిన అరుణ 2019 నవంబర్‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. -
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ మహిళకు రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెరిసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఈ టోర్నీలో 25 ఏళ్ల అరుణా రెడ్డి టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో అరుణ 13.800 స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో అరుణ 13.487 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈజిప్ట్, పోలాండ్ జిమ్నాస్ట్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫయింగ్‌లో అరుణ 11.35 పాయింట్లు స్కోరు చేయగా... ఫైనల్లో 12.37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో అరుణా రెడ్డి కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: ‘బీడబ్ల్యూఎఫ్’ అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు -
భారత జిమ్నాస్ట్స్ విఫలం
స్టుట్గార్ట్ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా క్రీడాకారిణులు నిరాశ పరిచారు. ప్రణతి నాయక్, ప్రణతి దాస్, తెలుగమ్మాయి బుద్ధా అరుణా రెడ్డి తమ ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఆల్ అరౌండ్ క్వాలిఫయింగ్‌లో ప్రణతి నాయక్ 45.832 పాయింట్లతో 127వ స్థానంలో... ప్రణతి దాస్ 45.248 పాయింట్లతో 132వ స్థానంలో నిలిచారు. వాల్ట్ ఈవెంట్లో ప్రణతి నాయక్ 14.200 పాయింట్లతో 27వ స్థానంతో సరిపెట్టుకుంది. అన్ఈవెన్ బార్స్‌లో ప్రణతి నాయక్ 10.566 పాయింట్లతో 164వ స్థానంలో... ప్రణతి దాస్ 9.916 పాయింట్లతో 182వ స్థానంలో... అరుణా రెడ్డి 8.925 పాయింట్లతో 193వ స్థానంలో నిలువడం గమనార్హం. బ్యాలెన్స్ బీమ్‌లో ప్రణతి దాస్ (10.866 పాయింట్లు) 138వ స్థానంలో... అరుణా రెడ్డి (10.200 పాయింట్లు) 164వ స్థానంలో... ప్రణతి నాయక్ (9.933 పాయింట్లు) 174వ స్థానంలో నిలిచారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ప్రణతి దాస్ (11.466 పాయింట్లు) 151వ స్థానంలో, ప్రణతి నాయక్ (11.133 పాయింట్లు) 179వ స్థానంలో నిలువగా...అరుణా రెడ్డి పోటీపడలేదు. -
ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌కు అరుణా రెడ్డి
హైదరాబాద్: వచ్చే నెలలో జర్మనీలో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు స్టుట్‌గార్ట్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణా రెడ్డితోపాటు ప్రణతి నాయక్, ప్రణతి దాస్‌లకు చోటు లభించింది. పురుషుల విభాగంలో ఆశిష్ కుమార్, ఆదిత్య సింగ్ రాణా (రైల్వేస్), యోగేశ్వర్ సింగ్ (సర్వీసెస్) భారత జట్టులోకి ఎంపికయ్యారు. 2018లో అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. -
ప్రభాస్ అంటే పిచ్చి: అరుణా రెడ్డి
‘నా లక్ష్యం 2020 ఒలింపిక్స్. ఇక నుంచి నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో ఆరేళ్లు పెళ్లి గురించి ఆలోచించను. ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటలు, షాపింగ్ చేస్తుంటాను. కారులో తిరుగుతూ సిటీలో రౌండ్స్ వేయడమంటే మరీఇష్టమ’ని చెప్పింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. హిమాయత్‌నగర్ :‘పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్ మీదనే. నా వయసు కూడా చాలా చిన్నదే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. సో... సిక్స్ ఇయర్స్ వరకు నో మ్యారేజ్. ఆరేళ్ల తర్వాతే పెళ్లి. అది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది అప్పుడే చెబుతాను. అప్పటి వరకు సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... నాకు టైమ్ దొరికితే ఫ్యామిలీతోనే ఉంటాను. మా అక్క, బావ, వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తాను. పిల్లలు పూర్వీ, నిషాంత్‌లతో ఆడుకుంటాను. వాళ్లే నా ప్రపంచం. ప్రతిరోజు అమ్మ సుభద్ర, అక్క పావని నాకోసం వెరైటీ వంటలు చేస్తుంటారు. వారికి రెస్ట్ ఇచ్చేందుకు అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని. అలా అలా వంటలు నేర్చుకున్నాను. ఎక్కువగా ‘బ్రౌనీస్’ చేస్తుంటాను. వీకెండ్స్‌లో చికెన్, మటన్, ఫిష్ కర్రీ వండి ఇంట్లో వాళ్లపైనే ట్రై చేస్తుంటాను (నవ్వుతూ). అవి ఎలా ఉంటాయో వాళ్లు చెప్పరు. కానీ సూపర్ ఉందని మాత్రం అంటారు. డ్రైవింగ్.. షాపింగ్ ఈ మధ్య డ్రైవింగ్‌పై ఇష్టం పెరిగింది. సిటీలోని ఇరుకు రోడ్లపై డ్రైవింగ్ చేయడం థ్రిల్‌గా అనిపిస్తుంది. మొదట్లో డ్రైవింగ్ చేయాలంటే భయం వేసేది. కానీ ఆటల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు డ్రైవింగ్ చేయడం చూశాను. నేనెందుకు నేర్చుకోకూడదని, ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను (నవ్వూతూ). టైమ్ దొరికితే చాలు.. షాపింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యమిస్తా. స్పోర్ట్స్ డ్రెస్సెస్ ధరించడంతో అవే అలవాటు అయ్యాయి. దీంతో ప్రతిసారి ప్రముఖ బ్రాండ్ల టీషర్టులను కొనుక్కుంటాను. నా దగ్గర దాదాపు 100కు పైగా టీషర్టులు ఉన్నాయి. చీరలు కట్టుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. అక్క చీరలన్నీ కట్టి పడేస్తూ విసుగు తెప్పిస్తుంటాను (నవ్వుతూ). పండగల సమయంలో చీరలు కట్టుకుంటాను. సిటీలో రౌండ్స్ స్కూల్ టైమ్ నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మొదట్లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే నాన్నకి చెప్పేదాన్ని. నాన్న ప్రాక్టీస్ అయిపోయాక తీసుకెళ్లేవారు. నాన్న మరణించాక అక్క, బావ వాళ్లతో వెళ్తున్నాను. హీరో ప్రభాస్ అంటే పిచ్చి. అనుష్క అంటే కూడా అభిమానం. బాలీవుడ్లో సారా అలీఖాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నైట్‌లో మన సిటీ చాలా అందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన సిటీని బాగా మిస్సవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ టైమ్‌లో అక్కకి, బావకి చెప్పి కారులో సిటీ మొత్తం రౌండ్స్ వేస్తాం. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, చార్మినార్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల్లో తిరుగుతుంటాం. ఫిట్నెస్... ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతాను. ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటై పోయింది. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. 10 నిమిషాలు వ్యాయామం చేశాక... లెమన్ వాటర్ తీసుకొని ప్రాక్టీస్‌కి వెళ్తాను. మళ్లీ 9గంటలకు ఇంటికి వస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్ కర్రీ విత్ చపాతీ తింటాను. ఆ తర్వాత రెండు గంటలు నిద్రపోతాను. లంచ్‌లో లైట్‌గా రైస్, నాన్‌వెజ్‌తో రోటీ తీసుకుంటాను. మళ్లీ మూడు గంటలకు జిమ్‌కి వెళ్తాను. ఆ తర్వాత ప్రాక్టీస్. రాత్రి ఇంటికి వచ్చాక రోటీ తిని పడుకుంటాను. ప్రతిరోజు 6–7గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టార్గెట్ ఒలింపిక్స్.. ఇప్పుడే గాయం నుంచి కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది. అక్టోబర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ చివరి క్వాలిఫయర్‌లో హాజరవుతాను. అందులో కచ్చితంగా ఎంపికై 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. గాయం నాలో మరింత కసి, పట్టుదలను పెంచింది. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్ పైనే. -
లక్ష్యం 2020 ఒలింపిక్స్
హైదరాబాద్: ‘విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌కి ఎంపికవ్వాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించి, పతకం తేవాలనే ఆకాంక్ష, పట్టుదల, సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే పట్టుదలతో ఇంటి నుంచి వెళ్లాను. ఒలింపిక్స్ అర్హత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మొదటి క్వాలిఫికేషన్ గేమ్‌లో ‘ఫార్వర్డ్ 5/40’ చేస్తూ కిందకు దిగుతుండగా పడిపోయాను. ఎలా పడ్డానో.. ఏం జరిగిందో.. కూడా నాకు అర్థం కాలేదంటూ’ వివరించింది జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ కాంస్య పతక విజేత బుద్దా అరుణా రెడ్డి. కాలికి బలమైన గాయం తగలడంతో క్వాలిఫయింగ్‌కు దూరమైయ్యింది. మూడు నెలల పాటు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు అరుణా రెడ్డికి చికిత్స చేశారు. చికిత్స విజయం కావడంతో శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఆమె ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అరుణా రెడ్డి మాట్లాడుతూ... ‘కాలికి గాయమైన సమయంలో నేను జర్మనీలో ఉన్నాను. గాయం తగ్గదని, ఆటకు దూరం అవుతానని చాలా మంది నన్ను భయపెట్టారు. మా కోచ్‌ని ఒప్పించి కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు దెబ్బ తగిలిన ఫీలింగ్ లేకుండా నన్ను మామూలు మనిషిని చేశారు. గాయం నాలో చాలా కసిని పెంచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడు క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఉన్నాయి. మొదటి దాంట్లోనే నేను గాయంపాలై ఇంటి బాట పట్టాను. నేను ఇంకా పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది. చివరి క్వాలిఫయింగ్ అక్టోబర్‌లో ఉంది. దానిలో పాల్గొంటా, అర్హత సాధిస్తా. 2020లో జరిగే ఒలిపింక్స్‌కు ఎంపికై దేశానికి పతకం తీసుకొస్తా. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒలింపిక్స్‌పైనే ఉంది’ అని అరుణ పేర్కొంది. కాంటినెంటల్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఫైజల్ సిద్దిఖీ మాట్లాడుతూ... అరుణ ‘ఏసీఎల్ రీకన్‌స్రక్షన్’ కోసం మా వద్దకు వచ్చింది. అర్థోపెడిక్స్ డాక్టర్ మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ల పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేశాం. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ విజయవంతం అయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. -
ముగ్గురు రాణులు
శ్రీకాకుళం జిల్లా పేరును అంతర్జాతీయ క్రీడా వేదికపై ‘లిఫ్ట్’ చేసిన నాటి క్రీడాకారిణులు కరణం మల్లేశ్వరి, పూజారి శైలజల బాటలోనే పయనిస్తున్నారు పాలకొండకు చెందిన అక్కచెల్లెళ్లు. అరుణా రాణి, ఉషారాణి, లలితారాణి. స్థానిక రైతు గార తిరుపతిరావు, చిన్నమ్మడు దంపతుల కుమార్తెలు అయిన ఈ ముగ్గురూ తండ్రి నుంచి స్ఫూర్తిని పొందినవారే. తిరుపతిరావు తన చిన్నతనం నుంచీ సంగిడీలు ఎత్తుతూ గ్రామీణ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన పిల్లల్ని కూడా క్రీడలవైపే మళ్లించారు. ఆ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన వెనుకంజ వేయలేదు. పిల్లలు కూడా తండ్రినే తొలి గురువుగా భావించారు. పెద్ద కుమార్తె అరుణా రాణి స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని క్రీడా మైదానంలో చిన్నచిన్న బరువులు ఎత్తుతూ తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. 2002లో క్రీడా పాఠశాలలో చేరిన అరుణ అక్కడ ఎస్.ఎ.సింగ్, మాణిక్యాలరావు వద్ద తర్ఫీదు పొందుతూ 2003–07 సంవత్సరాల మధ్య వివిధ జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై వెయిట్ లిఫ్టింగ్‌లో వరుస పతకాలు కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో రూరల్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో, కడపలో అత్యుత్తమ లిఫ్టర్‌గానూ బంగారు పతకాలు దక్కించుకున్నారు. ముంబయిలో మూడు వెండి, మూడు రజత పతకాలు పొందారు. లక్నోలో ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. రాజమండ్రిలో రాష్ట్రస్థాయి సీనియర్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత, విశాఖలో వెండి పతకాలతో పాటు, ఛత్తీస్‌గఢ్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. ఏలూరు సబ్‌జూనియర్, సీఎం ట్రోఫీలో బంగారు పతకాలు దక్కించుకున్నారు. చెన్నైలో మూడు రజతాలు, మణిపూర్‌లో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. జోర్డాన్‌లో జరిగిన నాలుగు దేశాల క్రీడాకారుల పోటీలలో 80 కేజీల స్నేచ్, 110 కిలోల క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మూడు బంగారు పతకాలు కైవసం చేసుకుని మహిళాక్రీడావనికే కాకుండా తన చెల్లెళ్లలోనూ స్ఫూర్తిని నింపారు. ప్రస్తుతం అరుణా రాణి స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. గత మూడేళ్లుగా కోల్‌కతా రైల్వేలో టెక్నీషియన్‌గా కొనసాగుతున్నారు. పీఈటీగా ఉషారాణి అరుణాæరాణి పెద్ద చెల్లి ఉషారాణి 2005లో క్రీడల్లోకి అడుగు పెట్టారు. జిల్లాస్థాయిలో, అదే ఏడాది కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 48 కిలోల విభాగంలో వెండి, తర్వాతి సంవత్సరం విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీల్లో 53 కిలోల విభాగంలో రాణించారు. హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్‌లో 48 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచారు. అలాగే మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం పీఈటీగా సరుబుజ్జీలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ క్రీడల్లో విద్యార్థినులకు చక్కటి శిక్షణ ఇస్తున్నారు. పతకాల వేటలో లలిత పెద్దక్క అరుణ బాటలో మూడవ చెల్లి లలితా రాణి ప్రతిభను కనబరుస్తున్నారు. అమలాపురం, కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, హైదరాబాద్‌లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు పతకాలు దక్కించుకున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. 2017లో డిసెంబరులో ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ , సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి ఉత్తమ లిఫ్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకునేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఎందులోనూ తక్కువ కాదు మహిళలు ఎందులోనూ తక్కువకాదు. మా చిన్నతనంలో ఆడపిల్లలు బరువులు ఎత్తటం ఏమిటని మాట్లాడుకునేవారు. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అదే స్ఫూర్తితో ధైర్యంగా ముగ్గురం ముందడుగు వేశాం. మాకంటూ గుర్తింపు లభించింది. – గార అరుణా రాణి, ఉషారాణి, లలితా రాణి – మారోజు కల్యాణ్ కుమార్, సాక్షి, పాలకొండ -
అరుణా రెడ్డికి ఏడో స్థానం
జకార్తా: ఆసియా క్రీడల జిమ్నాస్టిక్స్‌లో తెలుగుతేజం బుద్దా అరుణారెడ్డి (12.775 పాయింట్లు) విఫలమైంది. మహిళల వాల్ట్ ఫైనల్ ఈవెంట్లో బరిలోకి దిగిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్‌కు (12.650 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానం దక్కింది. ఫైనల్లో మహిళల కబడ్డీ జట్టు... భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకోగా... భారత మహిళల కబడ్డీ జట్టు వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 27–14తో చైనీస్ తైపీని ఓడించింది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 23–16తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇరాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టారు. గురి తప్పిన దీపిక భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మళ్లీ నిరాశపరిచింది. ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆర్చర్ మూడో రౌండ్లో 3–7తో చియెన్ యింగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల రికర్వ్‌లో అతాను దాస్ క్వార్టర్స్‌లో 3–7తో రియు ఎగా అగత సాల్సా బిల్లా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
భారత జిమ్నాస్టిక్స్ జట్టులో అరుణా రెడ్డి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే జిమ్నాస్టిక్ బృందంలో తెలుగు తేజం బుద్దా అరుణా రెడ్డికి చోటు దక్కింది. ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం 10 మందితో కూడిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ పురుషుల, మహిళల జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల బృందంలో తెలంగాణ జిమ్నాస్ట్ అరుణారెడ్డితో పాటు రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ప్రణతి దాస్, మందిరా చౌదరి, ప్రణతి నాయక్‌లు ఉన్నారు. పురుషుల జట్టులో రాకేశ్ పాత్రా, యోగేశ్వర్ సింగ్, గౌరవ్ కుమార్, ఆశిష్ కుమార్, సిద్ధార్థ్ వర్మలకు చోటు దక్కింది. ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన రెండు రోజుల ట్రయల్స్ అనంతరం జట్లను ఎంపిక చేశారు. -
ప్రముఖ జిమ్నాస్టిక్స్ కోచ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్. బ్రిజ్ కిశోర్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1993లో శాట్స్‌లో కోచ్‌గా చేరిన బ్రిజ్‌కిశోర్ ఎంతో మంది జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన బుద్ధా అరుణా రెడ్డి కూడా ఆయన శిష్యురాలే. ఆయన మృతి పట్ల ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంతాపసభను ఏర్పాటు చేసి రెండు నిమిషాల మౌనం పాటించింది. అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ఆయన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ కార్యదర్శి కె. ఫణిరావు, జిమ్నాస్టిక్స్ కార్యదర్శి కె. మహేశ్వర్, హాకీ కార్యదర్శి భీమ్‌సింగ్ సంతాపసభలో పాల్గొన్నారు. కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత -
వీడియో: విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా..
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. కాంస్య పతకం సాధించే వరకూ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని అరుణారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు... ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో అరుణారెడ్డి ప్రదర్శనకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది. -
విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా..
-
విశ్వవేదిక పైన మెరిసిన తెలుగు తేజం
-
ఒక్క పతకం మార్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఇది బాగా పాపులర్ అయిన టెలికామ్ యాడ్. ఇప్పుడు ఈ యాడ్‌కు సరిగ్గా సరిపోయేలా... ఒక్క పతకం ఓ జిమ్నాస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కోటీశ్వరురాలిని చేసేసింది. ఆ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కాగా... ఆ పతకం మెల్బోర్న్లో నెగ్గిన కాంస్యం. ఆమె సాధించిన కాంస్యంతో కాసులు... రాశులు కురుస్తున్నాయి. 14 ఏళ్లుగా ఆమె పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం గెలిచింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఆమె గుర్తింపు పొందింది. కాంస్యంతో కొత్త చరిత్ర సృష్టించిన ఆమెను శనివారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) లాల్‌బహదూర్ స్టేడియంలో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ‘శాట్స్’ తరఫున ప్రోత్సాహకంగా అరుణకు రూ. 20 లక్షల చెక్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, సువర్ణ అవనిస్ కంపెనీ యజమాని సురేందర్ ఆమెకు రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. శనివారం జరిగిన మరో కార్యక్రమంలో కొన్నాళ్లుగా అరుణకు చేయూతనిస్తోన్న ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తమ వంతుగా రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని అందజేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఊహించనిరీతిలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆదివారం ఆమె తన తల్లి సుభద్ర, సోదరి పావని రెడ్డిలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ ఘనతను కొనియాడిన ఆయన రూ. 2 కోట్ల నజరానా ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిశోర్‌కు కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిమ్నాస్ట్ అరుణకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం శంషాబాద్ నుంచి హైదర్ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ్ కప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ సహాకారంతో ఈ మెడల్ సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని అరుణ రెడ్డి తెలిపారు. -
జిమ్నాస్ట్ అరుణకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి కె.మహేశ్వర్ ఆమెను అభినందించారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమెను కలిసి సత్కరిం చారు. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను చూసి దేశం ఎంతో గర్విస్తోందని రంగారావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
‘ఫ్లోర్’ ఫైనల్లో అరుణ రెడ్డికి ఏడో స్థానం
ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో చివరిరోజు భారత జిమ్నాస్ట్‌లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం జరిగిన మహిళల ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఏడో స్థానంలో నిలిచింది. ఆమె 10.833 పాయింట్లు స్కోరు చేసింది. పారలల్ బార్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన రాకేశ్ పాత్రా 13.433 స్కోరుతో ఏడో స్థానాన్ని పొందాడు. శనివారం వాల్ట్ ఈవెంట్లో అరుణ రెడ్డి కాంస్యం గెలిచి ఈ మెగా ఈవెంట్లో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. Creates History By Clinching At The Gymnastics World Cup -
అరుణ చరిత్ర
విశ్వ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ఆమె ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. నేడు జరిగే ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాక్షి, హైదరాబాద్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్లెప్ (స్లొవేనియా–13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా –13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంట్‌గా ప్రపంచకప్‌కు పేరుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 2010లో ప్రపంచకప్ సిరీస్ మొదలైంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా చాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు గెలిచినా... ప్రపంచకప్‌లో మాత్రం పతకాలను సాధించలేకపోయింది. నిరీక్షణ ముగిసింది... పద్నాలుగేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో కొనసాగుతున్న అరుణ రెడ్డి జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధిం చింది. అయితే అంతర్జాతీయస్థాయిలో మాత్రం పతకం నెగ్గడం ఇదే తొలిసారి. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2014 కామన్వెల్త్ క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా క్వాలిఫయింగ్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు... ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. నాన్నకు ప్రేమతో... జిమ్నాస్ట్‌గా కెరీర్లో కుదురుకుంటున్న వేళ 2012లో అరుణ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురును ఏనాటికైనా చాంపియన్‌గా చూడాలనుకున్న ఆమె తండ్రి నారాయణ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ ఘటనతో కలత చెందిన అరుణ ఒకదశలో ఆటకు వీడ్కోలు చెప్పాలని భావించింది. అయితే తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో... సొంత ఇంటిని విక్రయించిన నాన్న త్యాగం వృథా కాకూడదని అరుణ భావించింది. అదే ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో స్వర్ణాలు గెలిచి నాన్న కలను సాకారం చేసింది. తండ్రి మరణంతో ఆటపై ఏకాగ్రత లోపించిన దశలో ఆమె తల్లి, అక్క, బావ ధైర్యం చెప్పి నిరంతరం ప్రోత్సహించడంతో అరుణ కెరీర్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చింది. -
చరిత్ర సృష్టించిన అరుణారెడ్డి
మెల్బోర్న్ : జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో అరుణా రెడ్డి కాంస్య పతకం గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో స్లొవేనియాకు చెందిన కైసెల్ప్, ఆస్ర్టేలియా క్రీడాకారిణి వైట్హెడ్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. 13.369 పాయింట్ల స్కోర్‌తో అరుణా రెడ్డి కాంస్య పతకం దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కైసెల్ఫ్ 13.800, వైట్‌హెడ్ 13.699 పాయింట్ల స్కోర్ సాధించారు. జిమ్నాస్టిక్స్ బరిలో నిలిచిన రెండవ భారతీయురాలు ప్రణతి నాయక్ 13.416 స్కోర్‌తో ఆరవ స్ధానంలో నిలిచారు. అరుణా రెడ్డి సాధించిన పతకం జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయ స్ధాయిలో భారత్‌కు మూడవ మెడల్ కావడం గమనార్హం. 2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయుడిగా అశిష్‌కుమార్ నిలిచారు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం దక్కించుకున్నారు.22 ఏళ్ల అరుణా రెడ్డి కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందారు. ఆమె గతంలో జిమ్నాస్టిక్స్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. -
మహిళా రియల్టర్ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్
-
తెలంగాణలో తొలిసారి: అరుణారెడ్డిపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్ : వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాచకొండ పోలీస్క మిషనర్ మహేశ్ భగవత్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణలో మొదటిసారి వైట్ కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు. అరుణ అనే మహిళపై ఇదివరకే 10 కేసులు నమోదయ్యాయని, 2009 నుంచి 19 మందిని మోసం రూ.3.23 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. 2005లో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి పీఎస్‌యూ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో సీబీఐ కూడా గతంలో అరుణారెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. పీడీ యాక్ట్ అనేది పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. -
అరుణా రెడ్డికి ఆరో స్థానం
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి మహిళల వాల్ట్ ఈవెంట్లో ఆరో స్థానం లభించింది. ఫైనల్లో అరుణ 12.825 స్కోరు సాధించింది. లియు జున్రు (చైనా–14.400 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ సు జాంగ్ (కొరియా–14.000 పాయింట్లు) రజతం, రై యోంగ్ (కొరియా–13.900) కాంస్యం సాధించారు. హరికృష్ణ గేమ్‘డ్రా’ మాస్కో: భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మాస్కో ఓపెన్ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. తెమూర్ రద్జబోవ్ (అజర్బైజాన్)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత హరికృష్ణ ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. -
ఆసియా జిమ్నాస్టిక్స్ ‘వాల్ట్’ ఫైనల్లో అరుణ
హైదరాబాద్: ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మహిళల వాల్ట్ ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో క్వాలిఫయింగ్‌లో అరుణా రెడ్డి 13.500 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ 13.200 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌లో మొత్తం 46 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొనగా... టాప్–8లో నిలిచిన వారు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నారు. -
మాయ లేడి రూ.20 కోట్లకు టోకరా
హైదరాబాద్: అధిక వడ్డీ వస్తుందని ఎర వేసింది. కోట్ల రూపాయలు దోచేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. అధిక వడ్డీల పేరుతో వివిధ ప్రాంతాలలో ప్రజలకు కోట్ల రూపాయలు మోసగించిన మాయ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డి చాలా మందికి అధిక వడ్డీలు ఇస్తామంటూ, మరికొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసులు చేసింది. మరికొందిరికి సగం ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఇలా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసింది. తిరిగి చెల్లించమని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరుణారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. విచారణలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ కేసులు ఉన్నాయని తెలసుకున్నపోలీసులు అరుణారెడ్డిని 3 రోజుల కస్టడీకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మల్కాజిగిరి సీఐ ను ఆశ్రయించారు. -
ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు
హైదరాబాద్: ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు పెట్టింది. తన మాయమాటలతో స్వామి వాహానాన్నే స్వాహా చేసింది.. అడిగితే.. అదిగో.. అల్లదిగో.. అంటూ కాలాన్ని వెళ్లదీసుకొచ్చింది.. అనుమానం వచ్చిన స్వామీజీ అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.. హతవిధి... ఏమిటిది అనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.. భక్తురాలిగా నమ్మించి స్వామీజీ వద్ద ఉన్న ఇన్నోవా వాహనంతో ఉడాయించిన ఆ కిలాడీ లేడీ కోసం ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో నివసించే ఎ.వి.కృష్ణారావు అలియాస్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి నివసిస్తుంటారు. ఆయన వద్దకు జె. అరుణారెడ్డి అనే మహిళ భక్తురాలిగా వస్తుండేది. అలా మహర్షి స్వామిజీకి నమ్మకంగా మారింది. గత మార్చి 20న మహర్షికి చెందిన ఇన్నోవా వాహనం టీఎస్ 09ఏక్యూ టీ/ఆర్ 2001 వెనక్కి తీస్తుండగా వాహనం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. అరుణారెడ్డి వాహనాన్ని రెండు రోజుల్లో బాగు చేయిస్తానని చెప్పి మహర్షిని నమ్మించి తనతోపాటు తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లిన ఆమె వాహనం రిపేర్ పేరుతో వాహనాన్ని తన వద్దనే ఉంచుకొంది. మహర్షి ఎన్నిసార్లు అడిగినా మాయమాటలతో బోల్తా కొట్టించింది. రోజుకో మాట చెప్పి నమ్మిస్తున్న అరుణారెడ్డి మాటలపై అనుమానం వచ్చిన మహర్షి అసలు విషయం ఆరా తీయాగా ఆమె వాహానాన్ని వేరే వాళ్లకి తాకట్టు పెట్టినట్లు తెలిసింది. అరుణారెడ్డి కూడా ఆశ్రమానికి రాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా రెండు రోజుల క్రితం అరుణారెడ్డి మల్కాజ్గిరి పోలీస్ స్టేసన్‌లో మోసం కేసులో అరెస్ట్ అయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నల్గొండలో, నారాయణగూడలో కూడా ఇలాంటి మోసం కేసులు ఆమెపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు పిటిషన్ వేసి ఆమెను అదుపులోకి తీసుకుంటామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అయితే మల్కాజీగిరి పోలీసులకంటే ముందుగానే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందినా పోలీసుల అలసత్వం కారణంగా మాయ లేడి దర్జాగా తప్పించుకొంది. ఇక్కడ పోలీసుల ఆలస్యం వల్ల ఆమె మరో మోసం చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే మల్కాజీగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్ట్ కావడం గమనార్హం. -
జాతీయ క్రీడల్లో అరుణకు రజతం
తిరువనంతపురం: కనువిందైన విన్యాసాలతో అలరించిన ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్ బుడ్డా అరుణా రెడ్డి శువ్రారం మహిళల ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. దీపా కర్మాకర్ (త్రిపుర) 13.0000 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా... అరుణా రెడ్డి 11.8600 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ జాతీయ క్రీడల్లోనూ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు ఆమె ఆల్‌రౌండ్, టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్ఈవెన్ పారలల్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాలతో కలిపి మొత్తం ఐదు స్వర్ణ పతకాలు నెగ్గడం విశేషం. ఇక పతకాల పట్టికలో సర్వీసెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
‘అరుణ’ పతాకం ఎగిరేనా!
‘కామన్వెల్త్’లో నేడు హైదరాబాదీ విన్యాసాలు పతకం వస్తుందన్న ఆశలో అభిమానులు సాక్షి, సిటీబ్యూరో: కామన్వెల్త్ గేమ్స్‌లో హైదరాబాదీ అరుణారెడ్డి మంగళవారం తన విన్యాసాలు ప్రదర్శించనున్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అరుణారెడ్డి మనదేశం తరఫున ఆర్టిస్టిక్స్, జిమ్నాస్టిక్స్ విభాగంలో విన్యాసాలను ప్రదర్శించేందుకు వెళ్లిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు. దక్షిణ భారతదేశం నుంచి ఆమె ఒక్కరే ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే అరుణ గతంలో వరల్డ్ స్కూల్ గేమ్స్(దోహ), జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్(జపాన్)లలో అద్భుత ప్రతిభ కనబరిచారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు గ్లాస్గోలోని ఎస్ఎస్ఈ హైడ్రోలో జరిగే ఈవెంట్ లో అరుణ భారతదేశం తరఫున ఫోర్స్ ఈవెంట్, అన్ఈవెన్బార్స్, బ్యాలెన్సింగ్భీం, వాల్ట్ విభాగాల్లో పోటీ పడనుంది. కామన్వెల్త్ గేమ్స్ కోసం జనవరి నుంచి ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న అరుణ ఈసారి తప్పకుండా పతకంతో తిరిగి వస్తుందని ఆమె సన్నిహితులు, బంధువులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.