న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే జిమ్నాస్టిక్ బృందంలో తెలుగు తేజం బుద్దా అరుణా రెడ్డికి చోటు దక్కింది. ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం 10 మందితో కూడిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ పురుషుల, మహిళల జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల బృందంలో తెలంగాణ జిమ్నాస్ట్ అరుణారెడ్డితో పాటు రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ప్రణతి దాస్, మందిరా చౌదరి, ప్రణతి నాయక్‌లు ఉన్నారు.
పురుషుల జట్టులో రాకేశ్ పాత్రా, యోగేశ్వర్ సింగ్, గౌరవ్ కుమార్, ఆశిష్ కుమార్, సిద్ధార్థ్ వర్మలకు చోటు దక్కింది. ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన రెండు రోజుల ట్రయల్స్ అనంతరం జట్లను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment