
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్‌ఐ) సదరు కోచ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. జీఎఫ్‌ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment