సాక్షి, హైదరాబాద్: ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెరిసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఈ టోర్నీలో 25 ఏళ్ల అరుణా రెడ్డి టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో అరుణ 13.800 స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఫైనల్లో అరుణ 13.487 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈజిప్ట్, పోలాండ్ జిమ్నాస్ట్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ క్వాలిఫయింగ్‌లో అరుణ 11.35 పాయింట్లు స్కోరు చేయగా... ఫైనల్లో 12.37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో అరుణా రెడ్డి కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది.
చదవండి: ‘బీడబ్ల్యూఎఫ్’ అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు
Comments
Please login to add a commentAdd a comment