
స్టుట్‌గార్ట్ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా క్రీడాకారిణులు నిరాశ పరిచారు. ప్రణతి నాయక్, ప్రణతి దాస్, తెలుగమ్మాయి బుద్ధా అరుణా రెడ్డి తమ ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఆల్ అరౌండ్ క్వాలిఫయింగ్‌లో ప్రణతి నాయక్ 45.832 పాయింట్లతో 127వ స్థానంలో... ప్రణతి దాస్ 45.248 పాయింట్లతో 132వ స్థానంలో నిలిచారు. వాల్ట్ ఈవెంట్‌లో ప్రణతి నాయక్ 14.200 పాయింట్లతో 27వ స్థానంతో సరిపెట్టుకుంది.
అన్‌ఈవెన్ బార్స్‌లో ప్రణతి నాయక్ 10.566 పాయింట్లతో 164వ స్థానంలో... ప్రణతి దాస్ 9.916 పాయింట్లతో 182వ స్థానంలో... అరుణా రెడ్డి 8.925 పాయింట్లతో 193వ స్థానంలో నిలువడం గమనార్హం. బ్యాలెన్స్ బీమ్‌లో ప్రణతి దాస్ (10.866 పాయింట్లు) 138వ స్థానంలో... అరుణా రెడ్డి (10.200 పాయింట్లు) 164వ స్థానంలో... ప్రణతి నాయక్ (9.933 పాయింట్లు) 174వ స్థానంలో నిలిచారు. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో ప్రణతి దాస్ (11.466 పాయింట్లు) 151వ స్థానంలో, ప్రణతి నాయక్ (11.133 పాయింట్లు) 179వ స్థానంలో నిలువగా...అరుణా రెడ్డి పోటీపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment