
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి కె.మహేశ్వర్ ఆమెను అభినందించారు.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమెను కలిసి సత్కరిం చారు. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను చూసి దేశం ఎంతో గర్విస్తోందని రంగారావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment