
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ప‍్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. కాంస్య పతకం సాధించే వరకూ ప‍్రపంచానికి పెద్దగా పరిచయం లేని అరుణారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు...
ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో అరుణారెడ్డి ప్రదర్శనకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment