
హైదరాబాద్: వచ్చే నెలలో జర్మనీలో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు స్టుట్‌గార్ట్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణా రెడ్డితోపాటు ప్రణతి నాయక్, ప్రణతి దాస్‌లకు చోటు లభించింది. పురుషుల విభాగంలో ఆశిష్ కుమార్, ఆదిత్య సింగ్ రాణా (రైల్వేస్), యోగేశ్వర్ సింగ్ (సర్వీసెస్) భారత జట్టులోకి ఎంపికయ్యారు. 2018లో అరుణా రెడ్డి మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment