మాయ లేడి రూ.20 కోట్లకు టోకరా
హైదరాబాద్: అధిక వడ్డీ వస్తుందని ఎర వేసింది. కోట్ల రూపాయలు దోచేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. అధిక వడ్డీల పేరుతో వివిధ ప్రాంతాలలో ప్రజలకు కోట్ల రూపాయలు మోసగించిన మాయ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డి చాలా మందికి అధిక వడ్డీలు ఇస్తామంటూ, మరికొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసులు చేసింది. మరికొందిరికి సగం ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికింది.
ఇలా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసింది. తిరిగి చెల్లించమని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరుణారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. విచారణలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ కేసులు ఉన్నాయని తెలసుకున్నపోలీసులు అరుణారెడ్డిని 3 రోజుల కస్టడీకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మల్కాజిగిరి సీఐ ను ఆశ్రయించారు.