Nalgonda Police
-
మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. మంగళవారం చండూరు మండల పరిధిలోని గుట్టుప్పల్ శివారులో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.19 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కారు ఢిక్కీలో ఈ డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నగదుతో పాటు ఓ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మునుగోడులో గత రెండు వారాల్లో భారీగా నగదు పట్టుబడడం ఇది మూడోసారి. పదిరోజుల కిందట రూ. 10 లక్షలు, సోమవారం(నిన్న) కోటి రూపాయలు తరలిస్తున్న ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో
సాక్షి, మిర్యాలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు కుమార్తె ప్రియాంక, అదే గ్రామానికి చెందిన తుర్క సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్లు అయినప్పటికీ, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా గత నెల 20న హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. బుధవారం ఈ విషయం ప్రియాంక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కలసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. చదవండి: మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ వారి వద్ద వివరాలు తీసుకున్న డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు కార్యాలయంలో మహిళా పోలీసులు లేనందున మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు డీఎస్పీ కార్యాలయం గేటు వద్దకు చేరుకునే లోగా అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ సైదులు అనుచరులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ జంట తిరిగి డీఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఎస్ఐని రక్షణగా ఉంచి పోలీస్ వాహనంలో వారిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో.. -
గంజాయి స్వాధీనానికి వెళ్లి.. కాల్పులు జరిపి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఏవోబీ(ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు)లో భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై మరికొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. గంజాయి హబ్‌గా.. హైదరాబాద్‌లోని సింగిరేణి కాలనీలో గంజాయికి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలికను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యచరణ కు దిగింది. ఈ క్రమంలో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్లగొండ డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి. ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన బృందాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాలపై దాడులకు దిగాయి. ఆదివారం 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, 20 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించుకునేందుకు ఆ ముఠాలోని మరికొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో రోడ్డుకు టిప్పర్‌ను అడ్డుపెట్టి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు జిల్లా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని, ఇద్దరు స్మగ్లర్లకు కాళ్లకు గాయాలైనట్లు పేర్కొన్నాయి. పక్కా వ్యూహంతో.. వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్ చేయించారు. కొనుగోలుదారుల పేరుతో రంగంలోకి దిగి.. గంజాయి కావాలని బేరం కుదుర్చుకున్నారు. అలా ఆప రేషన్ కొనసాగించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడులను ఏపీ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించామని నల్లగొండ ఎస్పీ చెబుతుండగా, విశాఖ ఎస్పీ మాత్రం నల్లగొండ పోలీసులు వచ్చిన సమాచా రమే తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఆత్మరక్షణ కోసమే కాల్పులు ‘విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి కేంద్రాలపై దాడులకు జిల్లా పోలీసు బృందాలు వెళ్లింది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో గంజాయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. అది కొనసాగుతున్న క్రమంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాయి. ఘటనలో ఏ ఒక్క పోలీస్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు’. – నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ 20 మంది వరకు అరెస్టు... ‘విశాఖ లంబసింగి సమీపంలో ఆదివారం సాయంత్రం గంజాయి స్మగ్లర్ల నుంచి ఆత్మరక్షణ కోసమే నల్లగొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు తీగలాగుతూ గంజాయి స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం ధ్వంసం అయ్యింది. అయితే, అనుకోకుండా ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు గాయాలయ్యాయి. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేశాం’ – విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు వెల్లడి -
రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ
నల్లగొండ క్రైం: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలుకు కానుక ఇవ్వాల్సిన అన్న ఆమె బంగారాన్నే దొంగలించాడు. చెల్లెకు బహుమతి ఇవ్వకుండా ఆమె సొత్తునే చోరీ చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రమేశ్‌కు రాఖీ కట్టేందుకు ఈ నెల 21వ తేదీన ఆయన చెల్లెలు పోగుల లలిత వచ్చింది. లలిత ఆ రోజు అక్కడే ఉంది. అయితే, లలిత తన ఏడు తులాల బంగారు ఆభరణాలను బీరువాలో దాచిపెట్టింది. అదే బీరువాలో తండ్రి ముత్తయ్య రూ.10 వేల నగదును కూడా పెట్టాడు. వాటిపై కన్నేసిన అన్న అదును చూసి బంగారం, నగదును అపహరించాడు. చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా రమేశ్ నిర్వాకం బయటపడింది. అతడితోపాటు అతడి స్నేహితుడు వెలగల విజయ్ను అరెస్టు చేశారు. వారి వద్ద నగదు బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? ) చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ
నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కర్ఫ్యూ అమలును ఎస్పీ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. టూటౌన్ పరిధిలో 20మందికి మించి వివాహ రిసెప్షన్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. రిసెప్షన్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు -
ఇంటర్ ఫెయిల్.. భద్రమ్ సినిమా చూసి దారుణం
పేద కుటుంబాలే టార్గెట్. ప్రాణాంతక వ్యాధులతో మృత్యుముఖంలోకి వెళుతున్న వారిని గుర్తించడం.. ఎలాగూ పోయేవాడే కదా నాలుగు రోజుల ముందే ఆయువు తీస్తే తప్పేముందని, డబ్బు ఆశ చూపి కుటుంబీకులను ఒప్పించడం. వారి పేరిట భారీ మొత్తానికి పాలసీ చేయించడం. ఆపై చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి.. బీమా క్లెయిమ్ చేసుకొని డబ్బులు పంచుకోవడం. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ అమలు. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తోంది కదా? ఇది సినిమా కథే. చిత్రం పేరు ‘భద్రమ్’. దాని నుంచే ప్రేరణ పొందాడు నల్లగొండ ఇన్సూరెన్స్ కుంభకోణం నిందితుడు రాజు. అమల్లో పెట్టేశాడు. ఇంటర్ ఫెయిల్ అయినా.. నేరాల్లో మాస్టర్ మైండ్. డబ్బు యావతో ఐదుగురి ప్రాణాలను తీసేశాడు. సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఇన్సూరెన్స్ కుంభకోణంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ ఫెయిలైన రాజు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేరాలు చేసిన విధానం, ఆ డబ్బును పంచుకున్న తీరు, ఈ క్రమంలో ఎక్కడా ఇటు పోలీసులకుగానీ, అటు వైద్యులకు గానీ చిక్కకుండా తప్పించుకున్న విధానం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నిందితుడు రాజు ఇంటర్ ఫెయిల్ కానీ, నేరాలు చేయడంలో ఆరితేరాడు. గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవాడు. క్రైం సీరియళ్లు, సినిమాలు చూసి నేరప్రవృత్తిని వంటబట్టించుకున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో మరణానికి చేరువవుతున్న వారిని గుర్తించడం, వారి కుటుంబసభ్యులతో ముందే ఒప్పందం చేసుకోవడం తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. సాధారణ పాలసీలు అయితే చాలాకాలం వేచి చూడాలి. పైగా క్లెయిమ్ చేసుకునే సమయంలో సవాలక్ష సమాధానాలు చెప్పాలి. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ అయితే, కేవలం ఒక ప్రీమియం కట్టేసి... మనిషిని లేపేసి డబ్బులు జేబులో వేసుకోవచ్చన్న దుష్టాలోచనతో అడుగులేశాడు. చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను బాగా అధ్యయనం చేసి... వాటిని వాడుకొని మనుషుల ప్రాణాలను తీసి, అక్రమంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించాడు. తక్కువ ప్రీమియంతో... భారీగా డబ్బు 2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులే కావడంతో సక్రియా కుటుంబాన్ని నిందితుడు ధీరావత్ రాజు సంప్రదించాడు. చనిపోయిన వ్యక్తి బతికున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి సాయంతో పత్రాలు సృష్టించి, ఆ తరువాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని చనిపోయాడని రూ.1.4 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ పథకం విజయవంతంగా అమలైంది. అది మొదలు రాజులో దుర్భుద్ధి పుట్టింది. కానీ, ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. 2014లో తొలి బీమా హత్య చేసే వరకు అతను దాదాపు 6 నుంచి 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏం చేశాడు? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2014లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘భద్రమ్’ను నిందితుడు చూశాడు. యాక్సిడెంట్ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్ చేసుకునే రాకెట్ నేపథ్యంతో సాగే కథ ఇది. ఇలాంటి నేపథ్యాలతో సాగిన సినిమాలతోనే నిందితుడు రాజు ప్రేరణ పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాధారణ బీమా చేయిస్తే.. అది అంత త్వరగా వర్తించదు. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకుంటే తీసుకున్న మరునాడే మరణించినా.. పూర్తిస్థాయి డబ్బులు వస్తాయి. ఏడాది కాలానికే వర్తించే యాక్సిడెంటల్ డెత్ పాలసీల్లో తక్కువ ప్రీమియంతో (కట్టిన ప్రీమియం వెనక్కిరాదు) ఎక్కువ రిస్క్ కవరేజి ఉంటుంది. ఇక్కడే రాజు తన తెలివితేటలు ప్రదర్శించాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) కొత్త నిబంధన ప్రకారం.. భార్య, రక్త సంబంధీకులకు తప్ప ఇతరులకు బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. అందుకే నామినీగా పెట్టేవారితో (కుటుంబీకులతో) రాజు ముందే ఒప్పందం చేసుకునే వాడు. బీమా డబ్బు రాగానే అనుకున్న ప్రకారం వాటాలు పంచుకునేవాడు. నాగార్జునసాగర్‌లో మరో కుంభకోణం నల్లగొండలో ఈ ఇన్సూరెన్స్ హత్యల దర్యాప్తు సాగుతుండగానే.. మరో బీమా కుంభకోణాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. నాగార్జునసాగర్‌లో ఆరేళ్ల క్రితం మామను యాక్సిడెంట్ పాలసీ చేయించి చంపిన అల్లుడి దుష్టపన్నాగం ఇది. ఇందులో నిందితుడు తన మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించాడు. ఆ మూడింటికి యజమాని మరణిస్తే.. నెలనెలా వాయిదాలు కట్టకుండా రద్దయిపోయేలా బీమా చేయించాడు. ఆ తరువాత మామకు భారీ మొత్తానికి యాక్సిడెంట్ పాలసీ చేయించాడు. అనంతరం ఇంకో అడుగు ముందుకేశాడు. ఇంకా తెలివిగా ఓ ప్రముఖ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీని వర్తింపజేస్తారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మామను హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో అల్లుడు యాక్సిడెంట్ పాలసీ కింద భారీ మొత్తాన్ని రాబట్టుకున్నాడు. పైగా మూడు భారీ వాహనాలకు నెల వాయిదాలు రద్దు అయ్యాయి. మరోవైపు బ్యాంకు వాళ్లు తమ ఖాతాదారుడు చనిపోయాడని బీమా సొమ్ము అందజేశారు. ఈ విధంగా ఐదు పాలసీల నుంచి లబ్ది పొందాడు. చదవండి: (దారుణం: బీమా చేయించారు.. 8 మందిని చంపేశారు) ఐఐబీకి రంగనాథ్ లేఖ ఈ వ్యవహారంలో మరిన్ని అక్రమాలు దాగి ఉన్నాయన్న అనుమానంతో వాటిపై కూపీలాగేందుకు నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ నడుం బిగించారు. గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో బీమా చేసిన ఏడాదిలోగా క్లెయిమ్ అయిన పాలసీల వివరాలు వెల్లడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)కి లేఖ రాశారు. ఈ సంస్థ అందించే వివరాల ఆధారంగా అనుమానాస్పద కేసులను తవ్వి తీయాలని నిర్ణయించారు. గత కేసుల సమయంలో పోలీసులు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక నిందితులతో సంబంధాలున్నాయా? అన్న విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. నిందితుడు ధీరావత్ రాజు ఇంటర్ ఫెయిలైనా.. క్రిమినల్ మైండ్‌లో మాత్రం మాస్టర్ అని, అతను ఇవి కాకుండా ఇంకా కొన్ని నేరాలు చేశాడా? లేక ఇతని సలహాలు, సూచనలతో ఇలాంటి నేరాలు ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగాయా? అన్న కోణంలోనూ డీఐజీ కూపీ లాగుతున్నారు. మొత్తంగా ఈ ముఠా ఇప్పటిదాకా ఐదుగురిని హతమార్చి, చనిపోయిన ఇద్దరి శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా డబ్బులు తీసుకుంది. మరో ఇద్దరిని చంపేందుకు ప్లాన్ చేసింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది. ఏపీలో రెండుసార్లు విఫలం... రెండేళ్లు జైలులో నిందితుడు రాజు పోలీసులకు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. 2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు అతని భార్యను సంప్రదించి ఒప్పించాడు. అదే సమయంలో అతని స్నేహితులు ఏపీలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి విషయంలోనూ ఇలాగే ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఆ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదమని నమ్మబలికేందుకు రాజు యత్నించాడు. కానీ, వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో రాజు జైలుకెళ్లాడు. ఆ తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లిలోనూ మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలోనూ విఫలమయ్యాడు. దీంతో దాదాపు రెండేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. విడుదలయ్యాక తిరిగి దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్యలో మరింత జాప్యం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేయగానే తిరిగి కోటిరెడ్డి పేరిట పలు ప్రైవేటు బీమా కంపెనీల నుంచి రూ.1.20 కోట్ల ఇన్సూరెన్సులు తీసుకున్నాడు. మొత్తానికి, కోటిరెడ్డిని చంపేందుకు 2017లోనే అవగాహన కుదిరినా.. దాన్ని అమలు చేసేందుకు 2021 వరకు సమయం పట్టిందని సమాచారం. ఈ అన్ని కేసులను రాజు క్షుణ్నంగా అధ్యయనం చేయడం గమనార్హం. వ్యక్తిని చంపాక పోలీసులు ఘటనాస్థలానికి రావడం, పంచనామా సమయంలో ఏయే ఆధారాలను నోట్ చేసుకుంటున్నారు? ఏయే అంశాల ఆధారంగా రోడ్ యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు అన్న విషయాలను పోలీసుల పక్కనే ఉండి నిందితుడు అధ్యయనం చేసినట్లు విచారణలో వెల్లడించడంతో పోలీసులు విస్మయం చెందారు. అందుకే, వ్యక్తులను చంపాక.. ఒకటికి రెండుసార్లు వాహనాలను వారి శరీరాలపై ఎక్కించడం, టైర్మార్కులు, వాహనం వచ్చిన డైరెక్షన్.. తదితర అంశాలను కచ్చితంగా పాటించి చూడగానే అది యాక్సిడెంట్ అనిపించేలా పకడ్బందీగా వ్యవహరించాడని తెలిసింది. -
శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్‌కు..
నల్గొండ: అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసులు ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నారు. తాజాగా ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని నిమిషాల వ్యవధిలో కాపాడి శభాశ్ పోలీస్ అనిపించుకున్నారు. ఈ సంఘటన నల్గొండలో జరిగింది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని స్పీడ్ డయల్ 100కు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు స్పందించారు. అయితే సమాచారం అందించిన వ్యక్తి మునుగోడు రోడ్డు అని మాత్రమే చెప్పారు. అయినా కూడా పోలీసులు అప్రమత్తమై గాలించి బలవన్మరణ యత్నం చేయాలనుకున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. విధి నిర్వహణలో భాగంగా సాగర్ రోడ్డులో ఉండగా మంగళవారం రాత్రి 9.44 నిమిషాలకి శంకర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నాడని 100కు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన సిబ్బంది అతడి సమాచారం అడగ్గా తన లొకేషన్ మునుగోడు రోడ్డు అని మాత్రమే తెలిపాడు. ఆ తర్వాత తిరిగి ఆయనకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అతడి గురించి సమాచారం తెలుసుకుని 4 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉరి వేసుకున్న శంకర్‌ను కాపాడారు. అయితే అప్పటికే ఉరి వేసుకోవడంతో స్తృహ తప్పాడు. వెంటనే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 100 సిబ్బంది సీహెచ్ సత్యనారాయణ, పీసీలు సురేశ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల పనితీరు మెరుగ్గా ఉండడంతో ప్రజలు అభినందిస్తున్నారు. -
ఫేస్‘బుక్’ అయ్యారు
నల్లగొండ క్రైం: పోలీసుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. రాజస్తాన్ వెళ్లి మరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 350 మంది పోలీసు అధికారుల పేరిట ఈ సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ మెసేజ్‌లు పంపి డబ్బులను ఖాతాల్లో జమ చేయించుకున్నారని వివరించారు. ఇదేవిధంగా తన పేరుతో కూడా నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని పోలీసు అధికారులకు సందేశాలు పంపారని, అయితే విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్తాన్‌కు పంపినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితులు అనేక రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అ«ధికారులకు రివార్డు ప్రకటిస్తామన్నారు. నిందితుల్లో ముగ్గురిని నల్లగొండ జైలుకు, బాలుడిని హైదరాబాద్‌లోని బాల నేరస్తుల జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. మొదట ఐజీ స్వాతి లక్రా పేరిట నకిలీ ఖాతాను సృష్టించగా, ఆ తర్వాత వారం పది రోజుల్లో నల్లగొండ జిల్లా ఎస్పీ పేరిట ఓ ఖాతా తెరిచారు. పోలీసుల పేరిటే నకిలీ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో జిల్లా పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకొని ఆ సైబర్ నేరగాళ్ల ఆటను కట్టించారు. -
నకిలి విత్తనాల గుట్టు రట్టు చేసిన పోలీసులు
సాక్షి, నల్గొండ: జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్‌ను మంగళవారం ఛేదించారు. ఈ రాకెట్‌కు సంబంధించిన 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30లక్షల విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాక్ చేసే మెషినరీ సామాగ్రిని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలం కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తనాల ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబుల్ లేకుండా కనిపించడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణ నుంచి ఆంధ్రవరకు ఈ రాకెట్‌కు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. (కరోనా టెస్ట్ చేయలేదని నానా హంగామా) దీంతో ఎస్పీ రంగనాధ్ జిల్లా స్థాయిలో ఏఎస్పీ సతీష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రంగంలోకి దిగి దీనితో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. గద్వాల జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన మరికొందరి పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. ఒక్కో లింక్ చేధిస్తున్న కొద్ది వీటిని విక్రయిస్తున్న ముఠా సభ్యులు మరికొంత మంది బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా పరిధిలోని గుర్రంపోడు, నకిరేకల్, శాలిగౌరారం, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన మరికొందరి పాత్ర వెల్లడైంది. మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు. అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వీటిని ప్యాకింగ్ చేసే వారు, రవాణా చేసే వారు, విక్రయించే వారు ఉన్నట్లు ఎస్పీ రంగనాధ్ వివరించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. వీరిపై పీడి యాక్టు పెట్టె యోచనలో ఉన్నట్లు, అందుకు సరిపోయే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఎస్పీ రంగనాధ్ వివరించారు. ఇప్పటికే ఈ విత్తనాలు కొని పంట వేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. (‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’) -
వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు
సాక్షి,నల్గొండ: కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదు. నాగార్జునసాగర్ దాటిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించే మాచర్ల చెక్ పోస్టును ఆంధ్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుగా గుర్తించడం లేదు. అందువల్ల మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. అందువల్ల మాచర్ల మీదుగా ఆంధ్రాలోకి వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనాలు వాడపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. నాగార్జున సాగర్ వెళ్లడానికి వచ్చి ఆంధ్ర చెక్‌పోస్ట్ వద్ద ఇబ్బందులు పడొద్దని డీఎస్పీ సూచించారు. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం -
యువతులను వేధిస్తున్న సైకో అరెస్ట్
సాక్షి, నల్గొండ : సోషల్ మీడియా ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్న సైకోనూ నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. నల్గొండకు చెందిన ఒక యువకుడు యువతుల పట్ల కరుడుగట్టిన సైకోలా మారాడు. వంద మందికి పైగా మహిళలు, యువతులకు ఫోన్‌కాల్స్ చేసి బెదిరించేవాడు. అంతేగాక వీడియో కాలింగ్‌ను రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసేవాడు. అనంతరం యువతులకు, మహిళలకు ఫోన్ చేసి లైంగికంగా లొంగకపోతే ఆ వీడియోలన్నింటిని తన స్నేహితులకు పంపిస్తానటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. తాజాగా సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి నల్గొండ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సైకోనూ అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
పోలీసుల.. చేతివాటం!
లాక్డౌన్ ఎందరినో ఇబ్బంది పెడుతూ.. మరెందరికో ఉపాధి లేకుండా చేసింది. ఇతర శాఖల సిబ్బందితోపాటు పోలీస్ యంత్రాంగం పూర్తిగా రోడ్లపైనే రేయింబవళ్లు డ్యూటీలు చేసి శభాష్ అనిపించుకుంది. కానీ, కొందరు పోలీసులు మాత్రం సొమ్ము చేసుకోవడంలో బిజీగా గడిపారు. లాక్డౌన్ సమయంలో జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. దీంతో తెరవెనుక దందాకు తెరలేసింది. ఇలా.. మద్యం అక్రమ వ్యాపారమే కొందరు పోలీస్ అధికారుల జేబుల నింపింది. తిమ్మిని బమ్మిని చేసేలా.. కేసులను తారుమారు చేసి నిందితులకు సహకరించేలా చేసింది..! సాక్షిప్రతినిధి, నల్లగొండ : లక్షల రూపాయలు పోసి తెచ్చుకున్న పోస్టింగ్.. పెట్టిన ఖర్చులను రాబట్టుకునేందుకు చట్టానికి తూట్లు పొడిచేలా కొందరు పోలీస్ అధికారులను ప్రేరేపిస్తోంది. ఫలితంగా కేసులు తారుమారు అవుతున్నాయి. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల పోస్టింగులకు ధరలు నిర్ణయించారు. సీఐ పోస్టింగ్ కావాలంటే రూ.5లక్షలు, ఎస్సై పోస్టింగ్‌కు అయితే రూ.3లక్షల రేటు పలుకుతోంది. ఉన్నతాధికారులు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఒకటీ రెండు చోట్ల మినహాయిస్తే.. మిగిలినవన్నీ పొలిటికల్ పోస్టింగులే అని సమాచారం. దీని ప్రభావం సవ్యంగా సాగాల్సిన ‘పోలీసింగ్’పై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలాచోట్ల ‘బ్యాక్ డోర్ బిజినెస్’ జరిగింది. అటు ఎక్సైజ్, ఇటు పోలీసులు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు ముట్టాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదో రకం దందా కాగా, మరికొన్ని చోట్ల ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మద్యం అక్రమంగా తరలించి వ్యాపారం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలీసులకు దొరికిపోయిన వారూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పోలీసులు స్వయంగా దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. వీటన్నింటికి భిన్నంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న మద్యం అక్రమ తరలింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇదీ... సంఘటన ! గత నెల 28వ తేదీన హాలియా పోలీస్ స్టేషన్లో మద్యం అక్రమ వ్యాపారానికి సంబంధించి కేసు (ఎఫ్ఐఆర్ నం:95/2020) నమోదు అయ్యింది. హాలియా పట్టణానికి చెందిన ఏసురాజు, మార్క్, చందు, వేణు, కోటేశ్, కనగల్ మండలానికి చెందిన కిరణ్‌కుమార్, నవీన్‌కుమార్ అనే ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. వీరు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను స్థానిక పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. ఎంత మద్యం స్వాధీనం చేసుకున్నారో వివరాలు కూడా వెల్లడించారు. ఆఫీసర్స్ చాయిస్ క్వార్టర్ బాటిళ్లు – 65, ఐబీ క్వార్టర్ బాటిళ్లు–25, మెక్‌డోవెల్ 90ఎంఎల్ బాటిళ్లు – 50, కెఎఫ్ బీర్లు–24 బాటిళ్లతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు, స్పష్టంగానే వివరాలు ప్రకటించారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం అక్రమ మద్యం కేసు వ్యవçహారంలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించిన వారిలో హాలియా పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులతోపాటు కనగల్ మండలానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా మద్యం కారులో తరలిస్తుండగా పట్టుకున్నాం. వీరందరిని విచారించగా అందులో ఓ వ్యక్తి విద్యార్థిగా ఉన్నందున వార్నింగ్ ఇచ్చి వదిలి వేశాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేలాల్సి ఉంది.– శివకుమార్, ఎస్ఐ, హాలియా ఏం జరిగింది..? ఈ కేసులో పోలీసుల స్వాధీనమైన రెండు వాహనాల్లో ఒకటి ఇంకా రిజిస్టర్ కానీ కొత్త కారు. అందులో రూ.8.25ల నగదు ఉన్నట్లు తెలియడంతో ఓ ఐడి పార్టీ కానిస్టేబుల్, కనగల్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మధ్యవర్తిగా బేరసారాలు నడిచాయని విశ్వసనీయ సమాచారం. ఈ నగదును రిలీజ్ చేయడం, కారును వదిలేయడం, కేసులో ఒక వ్యక్తి పేరును పక్కన పెట్టేందుకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఇందులో ముందుగా రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇక, ఈ కేసును తారుమారు చేసేందుకు కూడా కనీసం రూ.1.50లక్షలు మరో అధికారికి ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో బయట పడి రచ్చ జరగడంతో సదరు అధికారి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధి సంబంధీకుల చేతిలో పెట్టి పాప పరిహారం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనగల్ ప్రాంతం నుంచి హాలియాకు మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు మొదట ప్రకటించిన వివరాలకు, రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చిన వివరణకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇప్పుడు ఒక కారు, రెండు బైక్‌లను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. మరో వైపు తొలుత కేసు నమోదైన వారిలో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి చెందిన కొత్త కారును తప్పించిన విషయాన్ని దాటవేస్తున్నారు. మొత్తంగా ఈ చిన్న కేసులోనే రూ.2లక్షల దాకా చేతులు మారినట్లు చెబుతున్నారు. ఇందులో నుంచి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధికి చేరడం విచిత్రమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘హాజీపూర్’ ఘటనపై పోలీసుల వాదనలు పూర్తి
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన వరుస అత్యాచారాలు, హత్యల కేసులకు సంబంధించి పోలీసుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. రెండ్రోజులుగా నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ముందు పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రశేఖర్ ఓరల్ వాదనలు వినిపించారు. మూడు హత్యలకు సంబంధించి తొలి రోజు ఒక ఘటనకు సంబంధించి, రెండో రోజు మరో రెండు హత్యలకు సంబంధించి వాదనలు వినిపించారు. ఇద్దరు బాలికల హత్యలకు సంబంధించి వాదనలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఘటనకు సంబంధించి అన్ని రకాల ఆధారాలతోపాటు నిందితుడు తానే నేరం చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్న సాక్షులను కూడా కోర్టు ముందు ఉంచారు. దీంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డే హత్యలు, అత్యాచారాలు చేశాడని పీపీ చంద్రశేఖర్ వాదించారు. ఇలాంటి వారు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ఉరిశిక్షకు అర్హుడన్నారు. అనంతరం భువనగిరి యాదాద్రి జిల్లా ఏసీపీ భుజంగరావు నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను వివరిస్తూ తన వాదన వినిపించారు. దీంతో పోలీసుల తరఫు ఓరల్ వాదనలు పూర్తయ్యాయి. రాతపూర్వక వాదనల కోసం ఫైల్ దాఖలు చేయనున్నట్లు పీపీ చంద్రశేఖర్ తెలిపారు. నేడు నిందితుడి తరఫు ఓరల్ వాదనలు.. హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తరఫున లీగల్ సెల్ నియమించిన న్యాయవాది ఠాగూర్ వాదనలు బుధవారం వినిపించనున్నారు. మూడు హత్యా కేసులకు సంబంధించి ఈ వాదనలు వినిపిస్తారు. మరోవైపు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలంటూ మహిళా న్యాయవాదులు కోర్టు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
పోలీస్ రక్షణతో రోడ్డెక్కిన బస్సులు
నల్లగొండ రూరల్ : ఆర్టీసీ కార్మికుల నిరసన కొనసాగడంతో మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు డిపో దాటలేదు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌గా పనిచేసేందుకు వచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పూలు అందజేసి బతిమిలాడారు. వినని వారిపై దాడి చేసినట్లు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో చర్చించుకున్నారు. పోలీసులు బలవంతంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను నియమించి పోలీస్ పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించారు. దాడులు చేస్తున్నారన్న విషయం గుప్పుమనడంతో తాత్కాలికంగా పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్లు జంకారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చేవారిని అడ్డుకున్నారు. ప్రయాణికులు కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, మధ్యలోనే బస్సు నిలిపి వెళ్తే గమ్యానికి ఎలా చేరాలి అని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. డిపో నుంచి బస్సు తీసే క్రమంలో తాత్కాలిక డ్రైవర్ ఆర్టీసీ డీఎం సురేశ్‌బాబు కారును ఢీకొట్టాడు. ఆర్టీసీ కార్మికులతో కలిసిరావాలి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ కార్మికులతో కలిసి రావాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ద్రోహం చేయకుండా వారికి మద్దతుగా సమ్మెలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సలీం, బకరం శ్రీనివాస్, గురువయ్య, పందుల సైదులు, దుడుకు లక్ష్మీనారాయణ, అద్దంకి రవీందర్, ఇండ్లూరు సాగర్, దండెంపల్లి సత్తయ్య, ఐతగోని జనార్దన్‌గౌడ్, వీరా నాయక్, లింగయ్య, మానుపాటి భిక్షం, రాజు పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని తీర్మానం ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. స్థానిక పీఆర్టీయూ భవన్లో ఆర్టీసీ కార్మికులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బండారు ప్రసాద్, సీపీఎం నాయకులు పాలడుగు నాగార్జున, తుమ్మల వీరారెడ్డి, సలీం, సీపీఐ నేతలు కాంతయ్య, వీరస్వామి, టీడీపీ నాయకులు రఫీ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, న్యూ డెమోక్రసీ నేతలు ఇందూరు సాగర్, టీజేఎస్ నాయకుడు గోపాల్‌రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ తరపున పర్వతాలు, జనసేనా నుంచి మల్లేశ్, ఐఎన్టీయూసీ తరపున వెంకన్న, సీఐటీయూ నుంచి సత్తయ్య, టీవీవీ నుంచి పందుల సైదులు, విజయ్‌కుమార్, కాశయ్య, ఐద్వా నుంచి ప్రభావతి, మానవ హక్కుల వేదిక తరపున గురువయ్య, ఉపాధ్యాయ సంఘాల నుంచి సైదులు, బకరం శ్రీనివాస్, ప్రమీల, లింగయ్య, మానుపాటి భిక్షం, లక్ష్మీనారాయణ, జనార్దన్‌గౌడ్, రవి, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులకు కార్మిక సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కార్మికుల పక్షాన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత వారి నివాసాల వద్ద నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, నల్గొండ: రియాల్టర్, బిల్డర్ సోమ కేశవులును అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. కేశవులు హత్య లో అతని భార్య స్వాతి ప్రమేయం ఉందని, అతన్ని హతమార్చేందుకు రెండు నెలలుగా పలువురిని సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడు ప్రదీప్‌తో కలిసి భర్త హత్య కు స్వాతి స్కెచ్ వేసింది. ఎస్పీ ఎలక్ట్రానిక్స్ పేరుతో సీసీ కెమెరాల షాప్ నిర్వహిస్తున్న ప్రదీప్, స్థానికులైన శివ, శ్రీను సహయం తీసుకున్నాడు. హత్య తర్వాత నిందితులకు ఎంజాయ్ చేయడానికి స్వాతి లక్ష రూపాయలు ఇచ్చింది. కాగా, పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను తీరు మార్చుకోవాలని కేశవులు పలుమార్లు హెచ్చరించాడు. -
వసూళ్ల ఆగలే
జిల్లాలో కొందరు పోలీసు అధికారులు మళ్లీ వసూళ్ల పర్వానికి తెర లేపారా..? ఖాకీల హెచ్చరికలకు భయపడి నిర్వాహకులే నేరుగా స్టేషన్లో ఇచ్చి వెళ్తున్నారా.. జిల్లా పోలీస్ బాస్ భయానికి ఎలాగోలా ఆరు నెలలపాటు వసూళ్లు ఆపిన వీరు.. ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకుంటున్నారా అంటే ఆ శాఖలోని పరిణామాలు చూస్తుంటే.. అవుననే సమాధానం వస్తోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో వైన్‌షాపుల నుంచి పోలీసుల వసూళ్ల దందా జోరందుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఏవీ రంగనాథ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైన్‌షాపుల నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేశారు. ఆయన చేసిన హెచ్చరికలతో.. దాదాపు 6 నెలల పాటు మద్యం దుకాణాలనుంచి ఎలాంటి వసూళ్లూ చేయలేదు. గతంలో ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి వసూళ్ల కోసం ప్రత్యేకంగా హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి వ్యక్తిని నియమించి నెలవారీగా కొంత జేబులో వేసుకునేవారు. విషయం పసిగట్టిన ఎస్పీ రంగనాథ్ అక్రమ వసూళ్లకు చెక్ పెట్టడంతో కొందరు పోలీస్ అధికారులు లూప్లైన్లోకి కూడా వెళ్లిపోయారు. మరికొందరు అధికారులు వేచి చూసే ధోరణి అవలంబించారు. కింది స్థాయి అధికారులతో వసూళ్లు చేయించడంతో భాగస్వామ్యం ఉన్న పోలీసులను బదిలీ చేసి అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేశారు. కొన్నాళ్లుగా తిరిగి వసూళ్లు మొదలైనట్లు సమాచారం అందింది. వైన్‌షాపు నిర్వహకులే నేరుగా స్టేషన్లో ఇచ్చివెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. మరికొందరు రహస్యంగా వ్యక్తులను పెట్టుకొని వైన్స్‌లనుంచి మళ్లీ వసూలు చేస్తున్నారు. వసూలు చేయకుండా నిలిచిపోయిన ఆరు నెలల డబ్బులను కూడా తిరిగి రికవరీ చేసుకున్నారని సమాచారం. జిల్లాలో 138 వైన్‌షాపులు, 16 బార్లు ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ వంటి పట్టణాల్లో బార్లు, మద్యంషాపుల నుంచి నెలకు రూ.13వేల నుంచి రూ.15 వేల వరకు, మండల కేంద్రాల్లో రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు నెలవారీ వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రతినెలా పోలీసులకు రూ.15 లక్షల నుంచి 18లక్షల వరకు మామూళ్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు అక్రమంగా నిర్వహించే ఇతర దందాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వైన్‌షాపు నిర్వహకులు డబ్బులు ఇవ్వకపోతే సమయం దాటిపోయిందని, రోడ్డుపై వాహనాలు నిలిచాయని అభ్యంతరం చెబుతారని, తమ వ్యాపారం నడవదన్న భయంతో నెలవారీ వసూళ్లు అందజేస్తున్నారని పేర్కొంటున్నారు. నాకింత... నీకింత... పోలీసులు వసూలు చేసిన డబ్బులు నాకింత... నీకింత అని ఒక స్థాయి అధికారులు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వైన్‌షాపుల నుంచి నెలవారీగా వసూలు చేస్తున్న డబ్బుల్లో మూడు స్థాయిల్లో ఉండే అధికారులు పంచుకుంటున్నట్లు పోలీస్‌శాఖలోనే చర్చ జరుగుతోంది. స్టేషన్ ఖర్చులు అంటూ వైన్‌షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రతి స్టేష న్కు ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.73వేల వరకు నెలవారీ ఖర్చుల కింద అందజేస్తుంది. ఎక్సైజ్ శాఖదీ వసూళ్లదారే... జిల్లాలో ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా వైన్‌షాపులు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు ఎంతిస్తే తమకూ అంతే ఇవ్వాలంటూ కొర్రీలు పెట్టడంతో రూ.2వేల తేడాతో ఎక్సైజ్ శాఖ అధికారులు నెలవారీ వసూళ్లు చేస్తున్నారని తెలిసింది. పట్టణాల్లో రూ.13,500 పోలీసులకు ఇస్తే ఎక్సైజ్ వాళ్లు రూ.12,500 వసూలు చేస్తున్నట్లు వైన్‌షాప్ నిర్వహకులు చెబుతున్నారు. బార్ల నుంచి కూడా నెలవారీ మామూళ్లు నడుస్తున్నాయి. ఎక్సైజ్ శాఖకు నెలకు రూ. 15 లక్షల నుంచి 18 లక్షలు మామూళ్ల రూపంలో వెళ్తున్నాయి. ఎక్సైజ్ టెండర్లో షాప్‌లు దక్కించుకున్న వ్యాపారుల నుంచి ఒక్క దుకాణానికి రూ. లక్ష చొప్పున గుడ్‌విల్ తీసుకుని రికార్డుల ప్రక్రియ పూర్తి చేశారని, నెలవారీ వసూళ్లతోపాటు టెండర్లో వైన్‌షాప్ దక్కిన వ్యాపారి రూ.లక్ష చొప్పున ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు ప్రచారం ఉంది. -
వార్డు సభ్యుడిగా గెలిచి.. ఎంపీగా ఎదిగి..
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : దేశ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఈయన 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1984లో చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. 1985లో మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో చిట్యాల సింగిల్ విండో చైర్మన్‌గా గెలుపొందారు. 1992 నుంచి 99 వరకు వరసగా ఉరుమడ్ల గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా ఎన్నికై నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్‌గా పనిచేశారు. 1995–99 వరకు ఏపీ డెయిరీ చైర్మన్‌గా పనిచేస్తూనే నేషనల్ డెయిరీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేసి విజయం సాధించారు. ఎంపీగా.. 1999లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు గుత్తా సుఖేందర్‌రెడ్డి మొట్టమొదటి సారి పోటీచేసి ఘన విజయం సాధించారు. 2004లో నల్లగొండ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన 2009లో, 2014లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా నల్లగొండ ఎంపీగా మూడు సార్లు పనిచేసిన ఘనతను ఆయన సాధించారు. ఆయన ప్రస్తుతం గత ఏడాది కాలంగా క్యాబినేట్ హోదాలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్నారు. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ‘గుత్తా’ ప్రాతినిధ్యం మిర్యాలగూడ : మూడు పర్యాయాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం గుత్తా సుఖేందర్‌రెడ్డికే దక్కింది. ఆయన ఒకసారి టీడీపీ, మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరపున నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.1999లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుకుల జనార్ధన్‌రెడ్డిపై 79,735 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా అప్పట్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, భువనగిరి, ఆలేరు ఉన్నాయి. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి సీపీఐ అభ్యర్థి సురవరం సుధార్రెడ్డిపై 1,52,982 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేవలం నకిరేకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం లభించింది. -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, నల్లగొండ క్రైం : మిర్యాలగూడ కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యుల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.ఐదు లక్షల 18 వేల 500 నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రంగనాథ్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధానసూత్రధారి వేముల పుల్లారావుతో పాటు అతడి అనుచరులు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వేముల పుల్లారావు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం త్రిపురారం వచ్చి కిరాణ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడని, మూడేళ్ల నుంచి స్నేహితులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంత నష్టం రావడంతో తానే సొంతంగా బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ సంస్థ నుంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని నెలకు రూ.15 వేలు యాప్ సంస్థకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిచయం ఉన్న స్నేహితుల నుంచి సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ యాప్‌తో పాయింట్స్ ఆధారంగా, ఒక పాయింట్‌కు రూ.100 వసూలు చేస్తాడని, బెట్టింగ్ విస్తరణకు కొందరిని డిస్టిబ్యూటర్లుగా నియమించుకున్నాడని వివరించారు.బెట్టింగ్‌లో కస్టమర్ గెలిస్తే గెలిసిన డబ్బులో 5 శాతం డబ్బును తీసుకొని మిగతాది చెల్లించేవాడని, ఓడిపోతే వచ్చిన డబ్బును డిస్టిబ్యూటర్లతో కలిసి పంచుకునేవాడని తెలిపారు. నష్టం వచ్చే పరిస్థితి నెలకొంటే పాయింట్స్ అమ్మే వాడుకాదని, లేకుంటే మ్యాచ్ అయిపోయే వరకు పాయింట్స్ విక్రయించే వాడని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వీరే... కాగా పుల్లారావు డిస్టిబ్యూటర్లుగా షేక్‌సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, కోటి, భగత్ అలియాస్ కన్న, ఉపేందర్, సుమన్‌ను నియమించుకున్నాడు. వీరికి ప్రతి నెలా ఔరా 24 బెట్ సంస్థ వాళ్లు 3000 పాయింట్లు విక్రయిన్నారు. వీటిని డిస్టిబ్యూటర్లకు అమ్మగా వారు ప్రజలకు అధిక ధరకు విక్రయించేవారు. కీలక వ్యక్తుల అరెస్ట్ మిర్యాలగూడ అశోక్‌నగర్‌కు చెందిన వేముల పుల్లారా వు త్రిపురారంలో ఐదేళ్లపాటు చిట్టీలను నడిపాడు. మిర్యాలగూడలో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. చైతన్యనగర్‌కు చెందిన గోలి శ్రీనివాస్, శాంతినగర్‌కు చెందిన బోలిగొర్ల కోటేశ్వరావు, మోబైల్ షాపు నిర్వహిస్తున్న షేక్ ఇదయతుల్లా, శరణ్య గ్రీన్‌హోంకు చెందిన కనగంటి ఉపేందర్, అశోక్‌నగర్‌కు చెందిన కంబాల సుమన్ మొబైల్ షాపులు నిర్వహిస్తున్నారు. అశోక్‌నగర్‌లో పుల్లారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. షేక్ సాదీక్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, భగత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్ చేశాం: ఐజీ
సాక్షి, నల్లగొండ : రెండు రోజులుగా కనిపించకుండాపోయిన నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు జాడను కనిపెట్టామని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సర్వీస్ రివాల్వర్, సిమ్‌కార్డులను తిరిగిచ్చేసి అదృశ్యమైన సీఐ.. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్ట్స్‌లో మారుపేరుతో ఉన్నట్లు గుర్తించామని, ఇవాళే నల్లగొండ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకొస్తామని తెలిపారు. గాలింపు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే ఇప్పటికే అతనిని కలుసుకున్నట్లు తెలిసింది. అటు వెంకటేశ్వర్లు కుటుంబం కూడా నల్లగొండకు బయలుదేరినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉండటంతో అదృశ్యం ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మరో కేసు(పాలకూరి రమేశ్ హత్య)కు సంబంధించి నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. సర్వీస్ రివాల్వర్‌ను డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారు. వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో వరుస హత్యలపై సీఐని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి సీఐ ఆచూకీ లభించడంతో కుటుంబీకులు, పోలీసు శాఖ ఊపిరి పీల్చుకున్నట్లైంది. -
నల్లగొండలో కార్డన్ సెర్చ్
జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు కాలనీ మొత్తాన్ని జల్లెడపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. పాతబస్తీలో అనుమానితుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్టు ఖాకీలు పేర్కొన్నారు. నల్లగొండ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పోలీసులు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు హౌసింగ్‌బోర్డు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. గంజాయి అమ్మకాలు, శివారు ప్రాంతాల్లో పేకాటలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అనుమానిత వ్యక్తుల కదలికలను ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆధారాలు సక్రమంగా లేని 15 వాహనాలు సీజ్ చేశారు. పలువురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి సాయంత్రం వదిలేశారు. అనుమానిత నివాసాలను కూడా తనిఖీలు చేసి వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వదిలేశారు. అనుమానిత వ్యక్తులు, గుర్తుతెలియని వారికి ఇళ్లు కిరాయికి ఇవ్వొద్దని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాల ఆధారాలను చూపించి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆదిరెడ్డి, రమేష్, అనురాధ, ఎస్ఐలు మోతిరామ్, హన్మంతరెడ్డి, రామలింగదుర్గాప్రసాద్, హరిబాబు, శేఖర్ పాల్గొన్నారు. -
మాయ లేడి రూ.20 కోట్లకు టోకరా
హైదరాబాద్: అధిక వడ్డీ వస్తుందని ఎర వేసింది. కోట్ల రూపాయలు దోచేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. అధిక వడ్డీల పేరుతో వివిధ ప్రాంతాలలో ప్రజలకు కోట్ల రూపాయలు మోసగించిన మాయ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డి చాలా మందికి అధిక వడ్డీలు ఇస్తామంటూ, మరికొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసులు చేసింది. మరికొందిరికి సగం ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఇలా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసింది. తిరిగి చెల్లించమని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరుణారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. విచారణలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కూడా పెండింగ్ కేసులు ఉన్నాయని తెలసుకున్నపోలీసులు అరుణారెడ్డిని 3 రోజుల కస్టడీకి తీసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మల్కాజిగిరి సీఐ ను ఆశ్రయించారు. -
ముల్లును ముల్లుతోనే..!
* టిట్ ఫర్ టాట్ సూత్రంతో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్ * ఆన్లైన్ కిడ్నీ వ్యాపారుల గుట్టు ఆన్లైన్లోనే సేకరణ * కొరియర్ పేరిట వెళ్లి అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు * మరో కీలక ఏజెంట్‌ది మధ్యప్రదేశ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముల్లును ముల్లుతోనే తీయాలనే ఆలోచన.. టిట్ ఫర్ టాట్ సూత్రాన్ని కలగలిపి అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను ఛేదించారు నల్లగొండ పోలీసులు. దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన 20 రోజుల్లోపే రాకెట్ కీలక సూత్రధారిని పట్టుకున్న వీరు నేర పరిశోధనలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఏడేళ్లుగా ‘ఆన్లైన్ ఇంటర్నెట్’ను ఆయుధంగా చేసుకుని కిడ్నీ మాఫియాను తయారు చేసిన జాతీయస్థాయి కీలక ఏజెంట్ గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతిని పట్టుకునేందుకు అదే ఆన్‌లైన్‌ను వినియోగించారు. అతనికి సహకరిస్తున్న దిలీప్ ఉమేద్‌మాల్ చౌహాన్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. ‘పాయింట్ బ్లాంక్’ అరెస్ట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ రాకెట్ సూత్రధారి సురేశ్ ప్రజాపతిని అహ్మదాబాద్‌లోని అతడి ఇంటికే నేరుగా వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిడ్నీ రాకెట్లో నల్లగొండకు చెందిన కస్పరాజు సురేశ్ తదితరులు అరెస్టయిన విషయం అప్పుడే ప్రజాపతికి తెలిసిపోయింది. దీంతో అతను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. తాను ఆన్లైన్లో పెట్టిన నంబర్‌ను ఉపయోగించడం మానేశాడు. అహ్మదాబాద్‌లోని తన ఆఫీసును మూసేశాడు. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఉందామనే ఆలోచనతో తన సహచరులను కూడా అలర్ట్ చేశాడు. నల్లగొండ పోలీసులు ఆన్లైన్ సాయంతోనే ప్రజాపతి దగ్గరకు వెళ్లగలిగారు. ప్రజాపతి ఉపయోగించే ఫేస్బుక్ అకౌంట్లోకి ఓ నంబర్ సాయంతో ప్రవేశించి అతని ఫ్రెండ్స్ లిస్టును ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ లిస్టులో నుంచి ప్రజాపతి స్నేహితులను ఎంచుకుని వారిని సంప్రదించి అతడి గురించి ఆరా తీశారు. పూర్తి సమాచారం రాబట్టాక అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడ వల వేశారు. ప్రజాపతి ఉన్న ఇల్లును కనుగొన్నారు. అతడు ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతను ఉపయోగించే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ కొరియర్ వచ్చిందంటూ వెళ్లి డోర్ కొట్టారు. డోర్ తీసిన వెంటనే కొరియర్ వచ్చిందన్న విషయం చెప్పి మంచినీళ్లు కావాలని అడిగి ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ఇంట్లో సురేశ్ ప్రజాపతి కనిపించడంతో అతడేనని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక, కిడ్నీ రాకెట్లో మరో కీలక ఏజెంట్ దిలీప్‌ను కూడా ఆన్లైనే పట్టించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎరగా వేసి దిలీప్‌ను పట్టుకున్నారు. ఓ స్థానికుడి ద్వారా ఆన్లైన్లో ఉన్న అతడి నంబర్‌కు ఫోన్ చేయించి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఫలానా దగ్గరకు రావాలని సమాచారం అందించారు. దిలీప్ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన దగ్గరకు రావడం, అనూహ్యంగా పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకోవడం వెంటనే జరిగిపోయాయి. ప్రజాపతిపైనే ప్రతాపం ఇంటర్నెట్ సాయంతో కిడ్నీ రాకెట్ గుట్టును ఛేదించిన నల్లగొండ పోలీసులకు మరో సవాల్ ఎదురు నిలుస్తోంది. పోలీసు విచారణలో ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు మరో కీలక నిందితుడు ఈ కేసులో అరెస్టు కావాల్సి ఉంది. అతడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన వ్యక్తి అని సమాచారం. ఇత ను ప్రజాపతిని మించిన ఘనుడని తెలుస్తోంది.ఈ రాకెట్లో మరో ముఖ్య వ్యక్తిది మహారాష్ట్రలోని ముంబై. ఇతడు సురేశ్ ప్రజాపతికి రైట్‌హ్యాండ్. దక్షిణ భారత దేశం నుంచి ఎవరు వచ్చినా.. శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు మార్పించేది ఇతడేనని సమాచారం. వీరిద్దరినీ అరెస్టు చేస్తే మరో 100 మంది వరకు కిడ్నీ విక్రేతలు, గ్రహీతలు బయటకు వస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కారులో తరలిస్తున్న 5.30 కేజీల బంగారం పట్టివేత
మిర్యాలగూడ : కారులో అక్రమంగా తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పోలీసులు పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అక్రమంగా(బిల్లులు లేకుండా) తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. కాగా, నిందితుడు విజయవాడకు చెందిన బంగారం హోల్‌సేల్ వ్యాపారి సూరిబాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులకూ తాతిల్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ‘పోలీసులకు.. వారాంతపు సెలవు’పై నల్లగొండ పోలీసు అధికారులు తొలిఅడుగు వేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా వీక్లీఆఫ్ అమలు చేయనున్నారు. ఈ విధానం కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐల వరకూ వర్తిస్తుంది. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, తొలి ప్రసంగంలోనే కేసీఆర్ పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిని ఆధారం చేసుకుని ఇటీవల నల్లగొండలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఎస్పీ ఎదుట ఈ డిమాండ్ పెట్టారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల కోరిక, సీఎం అప్పటికే హామీ ఇచ్చి ఉండడంతో, ఎస్పీ అక్కడికిఅక్కడే ఆ సమావేశంలోనే ఈ ప్రకటన చేశారు. వారం రోజులుగా కసరత్తు చేసిన జిల్లా పోలీసు అధికారులు ఏఏ పోలీసు స్టేషన్లలో ఎవరెవరికి ఏఏ రోజు వారాంతపు సెలవు ఇవ్వనున్నారో పట్టిక తయారు చేశారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పోలీసులకు వీక్లీఆఫ్ అమలు కానుంది. ‘డీఎస్పీ స్థాయి వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. అందరిపైనా పనిఒత్తిడి ఉంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అయినా, తొలిఅడుగు పడింది. దీనికి సీఎం కేసీఆర్‌కు, హోం మినిష్టర్, డీజీపీలకు ముఖ్యంగా నల్లగొండ ఎస్పీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. రాష్ట్రంలోని ఇతర జిల్లాల ఎస్పీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం..’ అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి వివరించారు. జిల్లాలో 3వేల సిబ్బందికి ఊరట నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 123 పోలీస్స్టేషన్ల పరిధిలో 3వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా, మరో 850 మంది హోంగార్డులు, 680 మంది ఆర్ముడు రిజర్వు పోలీసులు ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు ఇక నుంచి వీక్లీ ఆఫ్ దక్కనుంది. ‘ ఇంత మంది పోలీసు కుటుంబాల్లో సంతోషం నింపే నిర్ణయం తీసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సిబ్బంది మరింత సమర్థతతో పనిచేయడానికి ఇది దోహదం చేస్తుంది..’ అని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు రామచంద్రం అభిప్రాయపడ్డారు. లబ్ధిపొందేది వీరే... కానిస్టేబుళ్లు 1850 హోంగార్డులు 850 ఏఆర్ పోలీసులు 680 హెడ్‌కానిస్టేబుళ్లు 366 ఏఎస్ఐలు 166 ఎస్ఐలు 150 సీఐలు 37