మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం! | Munugode Bypoll: Another Money Vehicle Caught At Ghatuppal | Sakshi
Sakshi News home page

మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం!

Published Tue, Oct 18 2022 1:54 PM | Last Updated on Tue, Oct 18 2022 2:13 PM

Munugode Bypoll: Another Money Vehicle Caught At Ghatuppal - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. మంగళవారం చండూరు మండల పరిధిలోని గుట్టుప్పల్‌ శివారులో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.19 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. 

కారు ఢిక్కీలో ఈ డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నగదుతో పాటు ఓ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.  దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మునుగోడులో గత రెండు వారాల్లో భారీగా నగదు పట్టుబడడం ఇది మూడోసారి. పదిరోజుల కిందట రూ. 10 లక్షలు, సోమవారం(నిన్న) కోటి రూపాయలు తరలిస్తున్న ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement